Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!

అమ్మఒడి పథకం నగదు సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో జమకానుంది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారికి అమ్మఒడి నగదు అందదు.

Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!

Amma Vodi

Amma Vodi : అమ్మఒడి పథకం నగదు సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో జమకానుంది. సీఎం జగన్ సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అమ్మ ఒడి నిధులను శ్రీకాకుళంలో జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరతారు. ఉదయం 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటలకు శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. జగనన్న అమ్మ ఒడి పథకం లబ్దిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కంప్యూటర్ బటన్ క్లిక్ తో అమ్మ ఒడి లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. అనంతరం సీఎం ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం నుంచి తిరుగు పయనమవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

Janasena On Amma Odi : ‘అమ్మఒడి’కి మంగళం..? నవరత్నాల్లో ఒక్కో రత్నం రాలిపోతోందన్న జనసేన

కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారికి అమ్మఒడి నగదు అందదు. జిల్లాల్లో లబ్దిదారుల పేర్లను పరిశీలించిన అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారిని జాబితా నుంచి తొలగించారు. విద్యార్థికి 75శాతం హాజరు లేకపోవడం, విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటడం, సొంత కారు, ఆదాయ పన్ను చెల్లిస్తుండటం, పరిమితికి మించి భూమి ఉన్నా, సొంత ఇంటి స్థల పరిమితి దాటడం, బ్యాంకుల్లో ఈ కేవైసీ పూర్తి చేయని వారు అమ్మఒడి పథకానికి అనర్హులు. వారి ఖాతాల్లో నగదు పడదు.

Botsa On Amma Vodi : లక్షమందికి పైగా అమ్మఒడి కోత..! మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

అయితే మూడో విడత అమ్మఒడి లబ్దిదారులకు జగన్ సర్కార్ భారీ షాక్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అమ్మఒడి లబ్దిదారుల సంఖ్యలో వివిధ కారణలతో ప్రభుత్వం లక్ష మందికిపైగా కోత పెట్టిందని తెలుస్తోంది. స్కూళ్లకు గైర్హాజరు కావడంతో 51 వేల మందిని అనర్హులుగా తేల్చిన ప్రభుత్వం.. వేర్వేరు కారణాలతో మరో 50 వేల మందికి అమ్మఒడి నిలిపివేసినట్టు తెలుస్తోంది.

జగన్ సీఎం అయ్యాక ఇచ్చిన మాట ప్రకారం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాల్లో అమ్మఒడి ఒకటి. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల్లో జగనన్న అమ్మఒడి పథకం అత్యంత ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా 15 వేల రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండేళ్ల పాటు లక్షలాది మందికి ఈ పథకాన్ని అందించిన విషయం తెలిసిందే.

మొదట 2022 జనవరిలో ఈ నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. వివిధ కారణాలతో అమ్మ ఒడి డబ్బుల విడుదలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది.