‘మత్స్యపరిశ్రమ రూపురేఖలు మారుస్తాం’…నాలుగు ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

  • Published By: bheemraj ,Published On : November 21, 2020 / 12:52 PM IST
‘మత్స్యపరిశ్రమ రూపురేఖలు మారుస్తాం’…నాలుగు ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

CM Jagan cobbled four fishing harbors : రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రపంచ మత్స్యకార దినోత్సం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సుదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో భాగంగా నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన చేశారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు 25 ఆక్వాహబ్ ల నిర్మాణ పనులకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.



ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్ లకు శంకుస్థాపన చేశామని తెలిపారు. డిసెంబర్ 15 వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని త్వరలో పనులు కూడా ప్రారంభం అవుతాయన్నారు. నవరత్నాల్లోని ప్రతీ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో 974 కి.మీ సువిశాలమైన సముద్ర తీరం ఉందని చెప్పారు. మత్స్యపరిశ్రమ రూపురేఖలు మారుస్తామని పేర్కొన్నారు. అవకాశం ఉన్న ప్రతీ నియోజకవర్గంలో ఆక్వాహబ్ ను నిర్మిస్తామని చెతప్పారు. 2019 ఎన్నికల వేళ మత్స్యకారుల సంక్షేమానికి మూడు వాగ్దానాలు ఇచ్చామని తెలిపారు.



https://10tv.in/posani-krishna-murali-praises-cm-kcr-ghmc-elections/
ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్రంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. చేపల వేట నిషేధ కాలంలో ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.10 వేలు ఇచ్చామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే గంగపుత్రులకు ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. రాబోయే ఏడాదిలోనే చేపలు, పీతలు, రొయ్యల రైతుల జీవితాన్ని పూర్తిగా మార్చేస్తామని చెప్పారు.



గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అతి తక్కువ జీతాలకు పని చేస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లో చేపల వేటకు వెళ్తూ వివిధ దేశాలకు పట్టుబడుతున్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడి వివిధ దేశాల జైల్లో ఉన్నమత్స్యకారులను విడిపించామని తెలిపారు. సముద్ర తీరంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నా మత్స్యకారుల జీవితాలు మారలేదన్నారు. మత్స్యకారుల కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదన్నారు. మత్స్యకారుల జీవితాలు, మత్స్య పరిశ్రమ రూపురేఖలు మార్చే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.