CM Jagan : నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీలో పర్యటించిన సీఎం జగన్.. వరద బాధితులను ఆదుకుంటామని హామీ

వరదలకు దెబ్బతిన్న నెల్లూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్‌ పర్యటించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పారు. నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్‌ కాలనీలో పర్యటించిన సీఎం జగన్ పెన్నా నదిని పరిశీలించారు.

10TV Telugu News

CM Jagan visited Nellore Bhagat Singh Colony : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల వరదలకు దెబ్బతిన్న నెల్లూరు జిల్లాలో పర్యటించారు. వరద బాధితులకు ధైర్యాన్ని చెప్పారు. నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్‌ కాలనీలో పర్యటించిన సీఎం జగన్.. పెన్నా నదిని పరిశీలించారు. పెన్నానది వరదతో నీటమునిగిన ఇళ్లను చూశారు. వరద బాధితులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నెల్లూరులో పెన్నానది బండ్ ఏర్పాటుకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్న సీఎం జగన్‌.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.

శంకుస్థాపనకు తానే వస్తానని హామీ ఇచ్చారు. సోమశిల ప్రాజెక్ట్ ఆప్రాన్‌కు కూడా 120 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. భగత్ సింగ్ కాలనీలోని ప్రజలకు వరద సహాయం అందకపోతే 5వ తేదీలోపు సచివాలయంలో అప్లై చేసుకోవాలని సూచించారు. కోవూరు నియోజకవర్గం పెనుబల్లిలోనూ వరద బాధితులతో మాట్లాడారు. జొన్నవాడలోనూ వరద నష్టాన్ని జగన్ పరిశీలించారు.
Omicron Tension In Delhi : ఢిల్లీలోనూ ఒమిక్రాన్ టెన్షన్…12 అనుమానిత కేసులు గుర్తింపు

నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం చేరుకున్న సీఎం జగన్..వరదలతో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను పరిశీలించారు. వరదల్లో బాధితులను ఆదుకోవడంలో జిల్లా యంత్రాంగం సమర్ధవంతంగా పని చేసిందన్న జగన్… జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నగర కమీషనర్ దినేష్ పని తీరును ప్రశంసించారు. ఇటు వైసీపీ నేత బీదా మస్తాన్‌రావు వరద బాధితుల సహాయార్ధం కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. సీఎం జగన్ కు చెక్కును అందించారు.

×