CM Jagan PM : సీఎం జగన్ ప్రధాని అవ్వాలి.. దేశంలోని పేదలందరి కోరిక అదే..

వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రధాని అవుతారని అన్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి జగన్ ప్రధాని కావాలని దేశంలో చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. ఏపీలో పేదవాళ్లకు జగన్ స్వర్గం చూపిస్తున్నారని తనకెంతో మంది చెప్పారని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.

CM Jagan PM : సీఎం జగన్ ప్రధాని అవ్వాలి.. దేశంలోని పేదలందరి కోరిక అదే..

Cm Jagan Pm

CM Jagan PM : వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రధాని అవుతారని అన్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి జగన్ ప్రధాని కావాలని దేశంలోని పేదలంతా కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. జగన్ సీఎం అయితే బాగుంటుందేమో అని వారంతా ఫీల్ అవుతున్నారని ఆయన అన్నారు. ఏపీలో పేదవాళ్లకు జగన్ స్వర్గం సృష్టిస్తున్నారని, ఈ విషయాన్ని తనకెంతో మంది చెప్పారని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఎమ్మెల్యే మాటలకు సీఎం జగన్ చిరునవ్వులు చిందిందారు. వాలంటీర్లు.. అరుపులతో హోరెత్తించారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి ఈ వ్యాఖ్యలు చేశారు.

cm jagan

వాలంటీర్ల సేవలకు సత్కారం:
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు అందజేస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో సీఎం జగన్ సోమవారం(ఏప్రిల్ 12,2021) ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లందరికీ అభినందనలు తెలిపారు.

volunteers

మీ వల్లే సకాలంలో అందుతున్నాయి:
రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వాలంటీర్లు పనిచేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్లే సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు చేరుతున్నాయన్నారు. సొంత లాభం కొంత మానుకుని పక్కవారికి సాయం చేస్తున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు జగన్. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి, వాడకి సంధానకర్తలుగా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు నిస్వార్ధంగా పనిచేస్తున్నారని సీఎం ప్రశంసించారు. వాలంటీర్ల సేవలకు మనసారా సెల్యూట్ చేశారు. వారి వల్లే సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు చేరుతున్నాయన్న సీఎం జగన్..కులాలు, మతాలు చూడకుండా పని చేస్తున్నారని ప్రశంసించారు.

cm jagan

97శాతం మంది యువకులే:
రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 60 వేల మంది వాలంటీర్లు 97 శాతం మంది యువకులే ఉండటం గర్వకారణని.. ఇందులో 50శాతం మంది మహిళలే ఉండటం సంతోషంగా ఉందన్నారు జగన్. వీరంతా పేదలు బాధలు అర్ధం చేసుకున్నవారేనని, వివక్షకు తావులేకుండా ఎలాంటి స్వార్ధం లేకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారని సీఎం జగన్ ప్రశంసించారు. వ్యవస్థను చక్కగా అమలు చేస్తున్న వారంతా నా వాలంటీర్లేనని గర్వంగా చెప్తున్నా అని అన్నారు.

cm jagan volunteers honour

వాలంటీర్లకు మరో గుడ్ న్యూస్:
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు సీఎం జగన్. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి దగ్గరికి చేరుస్తూ మన్ననలు పొందుతున్నారన్నారు. రూపాయి లంచం లేకుండా పింఛన్ అందిస్తున్న గొప్ప సైనికులని అన్నారు. సీఎం జగన్ వాలంటీర్లకు మరో శుభవార్త చెప్పారు. ఇక ప్రతి ఏటా వాలంటీర్లకు సత్కారం చేస్తామని, పురస్కారాలు ఇస్తామని ప్రకటించారు. ప్రతి జిల్లాలో రోజుకొక నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

ఇక ప్రతి ఏడాది సత్కారం:
రాష్ట్ర వ్యాప్తంగా సేవా మిత్ర అవార్డు కింద 2,18,115 మందిని సత్కరిస్తున్నామని సీఎం చెప్పారు. ఈ కేటగిరీలో ప్రతి వాలంటీర్ కు రూ.10వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా బ్యాడ్జి అందిస్తున్నామన్నారు. సేవారత్న అవార్డు కింద 4వేల మంది వాలంటీర్లకు రూ.20వేలు నగదు, పతకం, శాలువా, బ్యాడ్జీ అందజేస్తున్నట్లు తెలిపారు. మూడో కేటగిరీ సేవా వజ్ర అవార్డు కింద 875 మందికి రూ.30వేల నగదు సర్టిఫికెట్, శాలువాతో పాటు బ్యాడ్జి ఇస్తున్నామన్నారు. ఇక ప్రతి ఏడాది వాలంటీర్లకు సత్కారం చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రతి ఏడాది వాలంటీర్లు మెరుగైన పనితీరు కనబరచాలని పిలుపునిచ్చారు.