CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్‌..ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన | CM Jagan will lay the foundation stone for the Integrated Renewable Energy Storage Project Today

CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్‌..ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన

సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్‌ఐలను బందోబస్త్‌ విధులకు కేటాయించారు.

CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్‌..ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన

CM Jagan : ఏపీ సీఎం జగన్‌ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం బయలుదేరనున్నారు. గ్రీన్‌కో ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత మధ్యాహ్నం 2గంటల 5 నిమిషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

15 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 5వేల 410 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టు. దీని నుంచి సోలార్, విండ్, హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఇలా ఒకే ప్లాంట్‌ నుంచి మూడు రకాల విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిది.

Ap cm jagan : అలా చేయండి.. కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి

ఈ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేయనుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్‌ఐలను బందోబస్త్‌ విధులకు కేటాయించారు.

×