CM Jagan : నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం

ప్రతి ఏటా 3 విడతల్లో 13వేల 500 రూపాయల చొప్పున రైతులకు సీఎం జగన్ సాయం అందిస్తున్నారు. ఈ నెల 31న కేంద్రం రూ. 2 వేలు చొప్పున పీఎం కిసాన్ నిధులు ఇవ్వనుంది.

CM Jagan : నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం

Cm Jagan (7)

CM Jagan Eluru : ఏపీ సీఎం జగన్ నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను ఆయన విడుదల చేయనున్నారు. ఉదయం 10.10 గంటలకు గణపవరం చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 2022- 23 ఆర్థిక సంవత్సరం వైఎస్సార్‌ రైతు భరోసా నగదును బటన్‌ నొక్కి అర్హులైన అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. వరుసగా నాలుగో ఏడాది మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి 5వేల 500 చొప్పున వెళ్లనున్నాయి. ప్రతి ఏటా 3 విడతల్లో 13వేల 500 రూపాయల చొప్పున రైతులకు సీఎం జగన్ సాయం అందిస్తున్నారు. ఈ నెల 31న కేంద్రం రూ. 2 వేలు చొప్పున పీఎం కిసాన్ నిధులు ఇవ్వనుంది.

మొత్తంగా ఈ నెలాఖరు నాటికి 50లక్షల 10వేల మంది రైతుల ఖాతాల్లో 7వేల 500 రూపాయల చొప్పున దాదాపు 3వేల 758 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. రైతులు ఖరీఫ్‌కు సమాయత్తమవుతుండగా ముందుగానే పెట్టుబడి సాయం అందిస్తోంది ప్రభుత్వం. గణపవరంలో సీఎం పర్యటన కారణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బహిరంగ సభకు హాజరయ్యే రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు, ఐదు స్టాల్లను సిద్ధం చేశారు. స్థానిక మహాలక్ష్మి థియేటర్ సమీపంలో హెలిప్యాడ్‌ను రెడీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

CM Jagan : సీఎం జగన్ విదేశీ పర్యటన ఖరారు

రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో కలిపి రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. మే లో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో మిగిలిన రూ.2 వేలు చొప్పున జమ చేస్తోంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు కూడా ఈ సాయాన్ని అందిస్తోంది. మూడేళ్ల కంటే ఎక్కువగా ఈ ఏడాది పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకం కింద ఈ ఏడాది రూ.7,020 కోట్లు కేటాయించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతు భరోసా కోసం అర్హత పొందిన రైతు కుటుంబాలకు తొలి విడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ ఏడాది ఇప్పటివరకు 50,10,275 మంది అర్హత పొందారు. వీరిలో 47,98,817 మంది భూ యజమానులు కాగా, 1.20 లక్షల మంది కౌలుదారులు, 91,458 మంది అటవీ భూ సాగుదారులు ఉన్నారు. మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కౌలుదారులతో పాటు అటవీ సాగుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, ప్రభుత్వం ఈ ఏడాది తొలివిడతగా ఒక్కో కుటుంబానికి రూ.7,500 చొప్పున రూ.3,758 కోట్లు సాయం అందించబోతుందని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌ తెలిపారు. ఈ సాయంతో కలిపి ఇప్పటిదాకా రూ.23,875.59 కోట్ల లబ్ధి కల్పించినట్లవుతుందన్నారు.

CM Jagan : రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ : సీఎం జగన్

2019–20లో 46,69,375 కుటుంబాలకు రూ.6173 కోట్లు, 2020–21లో 51,59,045 కుటుంబాలకు రూ.6,928 కోట్లు, 2021–22లో 52,38,517 కుటుంబాలకు రూ.7016.59 కోట్ల సాయం అందించారు. తొలి ఏడాది లబ్ధి పొందిన వారిలో 45,11,252 మంది భూ యజమానులుండగా, 1,08,256 మంది కౌలుదారులు, 49,867 మంది అటవీ భూమి సాగుదారులున్నారు. రెండో ఏడాది లబ్ధి పొందిన వారిలో 50,04,874 మంది భూ యజమానులు, 69,899 మంది కౌలుదారులు, 84,272 మంది అటవీ భూ సాగుదారులున్నారు. మూడో ఏడాది 50,66,241 మంది భూ యజమానులు, 89,877 మంది కౌలుదారులు, 82,399 మంది అటవీ భూ సాగుదారులు ఉన్నారు. వీరు గత మూడేళ్లలో రూ.20,117.59 కోట్ల మేర లబ్ధి పొందారు.