CM Jagan : రేపు, ఎల్లుండి కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ సీఎం జగన్‌ వ్యక్తిగత పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్నారు. రేపు, ఎల్లుండి కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. రేపు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి జగన్ బయలుదేరనున్నారు.

CM Jagan : రేపు, ఎల్లుండి కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Jagan

CM Jagan Kadapa tour : ఏపీ సీఎం జగన్‌ వ్యక్తిగత పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్నారు. రేపు, ఎల్లుండి వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు జగన్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడపకు బయలుదేరనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేయనున్నారు.

ఎల్లుండి (2.09.2021) ఉదయం 9.30 గంటలకు దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో సీఎం జగన్ పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో మాట్లాడి తిరుగుపయనం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 12.45 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.