CM Jagan Key Directions : కరోనా కట్టడికి సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అటు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా.. మరోవైపు వ్యాపార సంస్థలు కూడా స్వచ్చంధంగా లాక్‌డౌన్ పాటిస్తున్నాయి.

CM Jagan Key Directions : కరోనా కట్టడికి సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Cm Jagan Key Directions

CM Jagan’s key directions : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అటు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా.. మరోవైపు వ్యాపార సంస్థలు కూడా స్వచ్చంధంగా లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో అప్రకటిత లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఏపీలో అంతకంతకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహించారు.



ఆసుపత్రుల్లో బాధితులకు బెడ్లు దొరకడం లేదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. కాల్‌ చేసిన 3 గంటల్లో బాధితులకు బెడ్‌ కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. కరోనా కాల్‌సెంటర్‌ అత్యంత సమర్థంగా పనిచేయాలన్నారు.. ఆస్పత్రికి వెళ్లడమా.. క్వారంటైన్‌కు తరలించడమా లేక హోం ఐసొలేషనా అన్న దానిపై సూచనలు ఇవ్వాలన్నారు..

ఏపీలో కరోనా బాధితులకు 104 నంబర్ వన్ స్టాప్ సొల్యూషన్ కావాలన్నారు సీఎం జగన్‌.. మరోవైపు సీఎం ఆదేశాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌ మూతపడ్డాయి… ఏ వేడుకలోనైనా 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు, బస్సుల్లో ప్రయాణికులను అనుమతిస్తున్నారు.



చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఇవాళ్టి నుంచి పాక్షిక లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది… తిరుపతి, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పుత్తూరులలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి.. రాష్ట్రంలో అన్ని జిల్లలా కంటే ఎక్కువగా చిత్తూరు జిల్లాలోనే కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు చిత్తూరు జిల్లా అధికారులు.

ఇప్పటికే తిరుపతి నగరాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు మున్సిపల్ అధికారులు.. నగరంలోని పలు వార్డుల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. తిరుపతిలో ఉన్న లక్ష ఇళ్లల్లో 10 వేల ఇళ్లల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాయలసీమలోనే ప్రతిష్టాత్మకంగా జరిగే తిరుపతి గంగమ్మ జాతరను కూడా రద్దు చేశారు.



ఇక బెజవాడలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో విజయవాడ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత అన్ని వ్యాపార సముదాయాలు మూసేయాలని ప్రకటించింది. అత్యవసర సేవలకు సంబంధించి షాపులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రకాశం జిల్లా చీరాలలో కూడా కరోనా ఆంక్షలు మొదలయ్యాయి.. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్‌ పాటిస్తున్నారు చీరాల ప్రజలు..

ఏపీ సరిహద్దు రాష్ట్రమైన కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ విధించింది అక్కడి ప్రభుత్వం.. 14 రోజుల పాటు ఈ లాక్‌డౌన్‌ కొనసాగనుంది.. కర్ణాటకలో రికార్డ్ స్థాయిలో దాదాపు 30 వేల కేసులు నమోదవుతుండటంతో.. యడ్డీ ప్రభుత్వానికి లాక్‌డౌన్‌ తప్ప మరే దారి కనిపించలేదు.. ఇక గుజరాత్‌ కూడా కేసుల పెరుగుతుండటంతో నైట్‌కర్ఫ్యూ అమల్లోకి తీసుకొచ్చింది.