AP CM Jagan: 3న తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన ..

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు.

AP CM Jagan: 3న తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన ..

AP CM Jagan

AP CM Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరుతారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 11గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు.

Pawan Letter CM Jagan : సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ

మధ్యాహ్నం 1గంట తరువాత అక్కడే ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.40గంటలకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Minister Botsa On AP Capital : 2-3 నెలల్లోనే.. ఏపీ రాజధానిపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

ఇదిలాఉంటే నూతన సంవత్సరం సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలనుద్దేశించి ట్వీట్ చేశారు. మీరు నాపై చూపిన ప్రేమ, మద్దతు, నమ్మకానికి ప్రతిఒక్కరికీ కృతజ్ఙతలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమంకోసం నిరంతరం కృషిచేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.