AP CM Jagan: నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరంలో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఏపీలో ఇటీవల పెంచిన పింఛన్‍ను లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న విషయం విధితమే. ఈ సందర్భంగా జగన్ పింఛన్ అందుకున్న లబ్ధిదారులతో ముఖాముఖీ మాట్లాడుతారు.

AP CM Jagan: నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

AP CM Jagan

AP CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమహేంద్రవరంలో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇటీవల ఏపీలో పెంచిన పింఛను రూ. 250 కలిపి రూ. 2,750 మొత్తాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుంది. ఈ సందర్భంగా పింఛన్ అందుకున్న లబ్ధిదారులతో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జగన్ ముఖాముఖీ మాట్లాడుతారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

AP CM Jagan: చంద్రబాబు హైదరాబాద్‌కు లోకల్.. కుప్పంకు నాన్ లోకల్ ..

రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం పింఛన్ కు అదనంగా రూ. 250 పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో మొత్తం 2,750 పింఛన్ లబ్ధిదారులకు చేరుతుంది. ఈ క్రమంలో జిల్లాలో 9,147 అదనపు పింఛన్లు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురి లబ్ధిదారుల మనోభావాలను తెలుసుకొనేందుకు వారితో సీఎం జగన్ ముఖాముఖీ నిర్వహించనున్నారు.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..

పర్యటనలో భాగంగా.. ఉదయం 11గంటలకు రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి.. అనంతరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు బయలుదేరుతారు. మున్సిపల్ గ్రౌండ్ నుంచి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ బహిరంగ సభ ప్రాంగణం వరకు రోడ్ షోలో జగన్ పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తారు. అనంతరం లబ్ధిదారుల అభిప్రాయాలు సీఎం జగన్ తెలుసుకుంటారు. ఆ తరువాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తిరిగి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ బయలుదేరుతారు.