CM Jagan Narsapuram Tour: నేడు నరసాపురంకు సీఎం జగన్‌.. పర్యటన షెడ్యూల్ ఇలా..

ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సాపురం  పర్యటన ప్రారంభమవుతుంది. 10.05 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి చినమామిడిపల్లిలోని హెలిప్యాడ్ కు 10.50 గంటలకు చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల అనంతరం 12.55 గంటలకు నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు నాయకులతో సమావేశమవుతారు. తిరిగి 1.15 గంటలకు తిరిగి తాడేపల్లి వెళ్తారు.

CM Jagan Narsapuram Tour: నేడు నరసాపురంకు సీఎం జగన్‌.. పర్యటన షెడ్యూల్ ఇలా..

CM Jagan Narsapuram Tour: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ సుమారు 3,300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆక్వా విశ్వవిద్యాలయం, మోళ్లపర్రు వద్ద ఉప్పటేరుపై నిర్మించనున్న రెగ్యూలేటర్, సబ్ ట్రెజరీ కార్యాలయ భవనం, రుస్తుంబాదలో 33కేవీ విద్యుత్ ఉపకేంద్రం, జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు.

CM Jagan Balakrishna Wishes : పరస్పరం పలకరించుకున్న సీఎం జగన్, ఎమ్మెల్యే బాలకృష్ణ

అదేవిధంగా నరసాపురం భూగర్భ డ్రెయిన్, వశిష్ఠ వారధి, బుడ్డిగవానిరేవు ఏటిగట్టు పటిష్టత, శేషావతారం పంట కాలువ అభివృద్ధి పనులు, కాజ ఈస్టు కుక్కిలేరు, ముస్కేపాలెం అవుట్ పాల్, మొగల్తూరు వియర్ ఛానల్ నిర్మాణం పనుల శిలాఫలకం ఆవిష్కరణ, అంతేకాక నరసాపురంలో ఆధునికీకరించిన బస్టాండు, నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి భవన ప్రారంభోత్సవం శిలాఫలకాలను ఏపీ జగన్ ఆవిష్కరించనున్నారు. కంపెనీ భూముల రైతులకు హక్కు పత్రాలను సీఎం అందిస్తారు. అనంతరం సభాప్రాంగణం వద్దలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.

AP CM Jagan: కృష్ణ భౌతిక‌కాయానికి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్.. ఫొటోలు

ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సాపురం  పర్యటన ప్రారంభమవుతుంది. 10.05 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి చినమామిడిపల్లిలోని హెలిప్యాడ్ కు 10.50 గంటలకు చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల అనంతరం 12.55 గంటలకు నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు నాయకులతో సమావేశమవుతారు. తిరిగి 1.15 గంటలకు తిరిగి తాడేపల్లి వెళ్తారు. ఇదిలాఉంటే సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ పి. ప్రశాంతి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజులు ఆదివారం పర్యవేక్షించారు. సీఎం పాల్గొనే సభా వేదిక, శిలాఫలకాలతోపాటు తదితర ఏర్పాట్లను పరిశీలించారు.