YS Jagan: నేటి నుంచి వైఎస్సార్ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. అభివృద్ధి పనుల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు.

YS Jagan: నేటి నుంచి వైఎస్సార్ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. అభివృద్ధి పనుల ప్రారంభం

YS Jagan: ఏపీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. డిసెంబర్ 2,3 తేదీల్లో ఆయన జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Maharashtra: బాలికపై పదిహేనేళ్ల బాలుడి హత్యాచారం.. బాలిక తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దారుణం

శుక్రవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద ఉన్న సీబీఆర్ రిజర్వాయర్ చేరుకుంటారు. అక్కడ బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్ వద్ద నిర్మించిన రెస్టారెంట్ ప్రారంభిస్తారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశమవుతారు. అక్కడి ప్రజల దగ్గరి నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఇడుపులపాయ గెస్ట్ హౌజ్ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం ఇడుపులపాయ నుంచి పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. అక్కడ ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన అధికారిక నివాసానికి బయల్దేరుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Akhilesh Yadav: 100 మంది ఎమ్మెల్యేలను తీసుకురండి.. సీఎం అవ్వండి.. యూపీ డిప్యూటీ సీఎంలకు అఖిలేష్ ఆఫర్

జగన్ పర్యటించే ప్రాంతాల్లో సీఎం కాన్వాయ్‌తో ఇప్పటికే రిహార్సల్స్ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. సీఎం భద్రత కోసం నలుగురు అడిషనల్ డీఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 1,500 మంది పోలీసు బలగాలు సేవలందిస్తున్నారు.