Sajjala : కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చు, జగన్ ప్రభుత్వ సలహాదారు ఆసక్తికర వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ..

Sajjala : కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చు, జగన్ ప్రభుత్వ సలహాదారు ఆసక్తికర వ్యాఖ్యలు

Sajjala

Sajjala : టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టుకోవచ్చు దానికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. ఏపీలోనే కాదు ఇండియాలో ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని సజ్జల అన్నారు. కేఆర్ ఏదో అంటాడు, చంద్రబాబు మరేదో అంటాడని.. వారిద్దరి మధ్య ఎలాంటి ఒప్పందాలు, బంధాలు ఉన్నాయో తెలీయదన్నారు.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

శ్రీశైలం నుండి అక్రమంగా నీళ్లు వాడేసుకుంటే తెలంగాణలో కరెంటు కొరత ఎందుకొస్తుందని సజ్జల ప్రశ్నించారు. విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగితే, తెలంగాణకు మాత్రం బెనిఫిట్ జరిగిందన్నారు. విభజన వల్ల, చంద్రబాబు వల్ల ఏపీ ప్రజల బతుకులు అంధకారంలో పడ్డాయన్నారు. ఇప్పుడు మన అదృష్టం జగన్ వంటి వ్యక్తి సీఎం అవ్వడమే అని సజ్జల అన్నారు.

వారం రోజుల క్రితం మొదలు పెట్టిన బూతు డ్రామాకు చంద్రబాబు నిన్న తెర దించారని.. సంక్షేమ పాలన నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన బూతు డ్రామా ఫెయిల్ అయ్యిందన్నారు. చంద్రబాబు చర్యలు ఏపీకి తీవ్ర నష్టం కలిగే విధంగా ఉన్నాయన్నారు. ఢిల్లీ టూర్ పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా నడిపారని సజ్జల విమర్శించారు. డ్రగ్స్‌ పేరుతో రాష్ట్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.

LPG Price: వారం రోజుల్లో మరో రూ.100 పెరగనున్న వంట గ్యాస్

ఢిల్లీ స్థాయిలో ఏపీ పరువు తీసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అబద్ధాలు ప్రొజెక్ట్‌ చేయడంలో చం‍ద్రబాబుకు మించిన వాళ్లు లేరని అన్నారు. అమిత్‌ షా ఫోన్‌ చేసినట్లు చంద్రబాబు కలరింగ్‌ ఇచ్చారని అన్నారు. ఎయిడెడ్‌ స్కూళ్లపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు. ఏపీలో జరిగిన ఆందోళనల్లో టీడీపీ ప్రమేయం ఉందని సజ్జల ఆరోపించారు.