చెక్ చేసుకోండి : మహిళల అకౌంట్లో రూ. 18 వేల 750

  • Published By: madhu ,Published On : August 12, 2020 / 09:28 AM IST
చెక్ చేసుకోండి : మహిళల అకౌంట్లో రూ. 18 వేల 750

ఏపీ సర్కార్‌ మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 2020, ఆగస్టు 12వ తేదీ బుధవారం ప్రారంభించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఈ పథకంలో భాగంగా… ప్రతియేటా 18వేల 750 చొప్పున నాలుగేళ్ల కాలంలో 75వేల రూపాయలు మహిళలకు ఉచితంగా అందించనున్నారు. దాదాపు 25 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. మహిళల్లో ఆర్థిక సుస్థిరత, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటునందించేలా ఈ పథకం ద్వారా చర్యలు తీసుకుంటున్నారు.

లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాల్లోకి సీఎం జగన్‌ ఈ మొత్తాన్ని జమ చేస్తారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు, మండల, గ్రామస్థాయిలో లబ్ధిదారులతో కలిసి స్థానిక నేతలు ఈ పథకం ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నారు.

సెర్ప్, మెప్మాలు ఇందుకు ఏర్పాట్లు చేశాయి. అక్కచెల్లెమ్మల జీవితాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి అన్ని విధాలుగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం జగన్. వైఎస్సార్ చేయూత కార్యక్రమం సందర్భంగా మహళలకు సీఎం జగన్..బహిరంగ లేఖ రాశారు.