YS Jagan : శాసన మండలి ఉండాల్సిందే..! వైఖరి మార్చుకున్న ఏపీ సర్కార్!!

ఇపుడు శాసన మండలిలో వైసీపీకి ఆధిక్యం పెరిగింది. దీంతో..

YS Jagan : శాసన మండలి ఉండాల్సిందే..! వైఖరి మార్చుకున్న ఏపీ సర్కార్!!

Ys Jagan Council

YS Jagan : రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుని సంచలనం సృష్టించిన ఏపీ సర్కారు… మరో అంశంలోనూ యూటర్న్ తీసుకోవాలని డిసైడైంది. సమస్యలు రాకుండా చూసుకోవడం…. రాజకీయంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడం ఈ నిర్ణయాల వెనుక కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ గతంలో కేంద్రానికి పంపిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ సర్కారు తాజాగా నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది. ఈ నిర్ణయంపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి మళ్లీ పంపేలా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది.

Read This : Government Jobs : డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం, జీతం రూ.93 వేలు.. ఏపీలో గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రాజధాని వికేంద్రీకరణ బిల్లు, స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బిల్లులు అసెంబ్లీలో గట్టెక్కినా… గతంలో శాసన మండలిలో పాస్ కాలేకపోయాయి. ఆ సమయంలో టీడీపీకి మండలిలో బలం ఎక్కువగా ఉండేది. ఈ కారణంతో.. మండలిలో కీలక బిల్లులపై వ్యతిరేకత వ్యక్తమైంది. 175 మంది సభ్యులున్న అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలతో అధికార పార్టీ ఓ తీర్మానం చేసినా.. అది పెద్దల సభలో వీగిపోవడాన్ని సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణించారు. ప్రజామోదం ఉన్న సభలో బిల్లులు గట్టెక్కితే చాలు… మండలితో అవసరం లేదని నిర్ణయించారు. 2020 జనవరి చివరివారంలో శాసన మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆమోదం తర్వాత కేంద్రానికి పంపించారు.

Read This : Buggana on Hyderabad: హైదరాబాద్‌పై ఏపీ మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు

ఇపుడు శాసన మండలిలో వైసీపీకి ఆధిక్యం పెరిగింది. దీంతో.. శాసన మండలిని పునరుద్ధరించాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కేంద్రానికి పంపిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేయనున్నట్టు సమాచారం. శాసన మండలిలో బలం పెరగడంతోనే ఈ నిర్ణయం జగన్ సర్కార్ ఈ డెసిషన్ తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.