CM Jagan Chandrababu Naidu : ఒకే వేదికపైకి సీఎం జగన్, చంద్రబాబు..! పలకరించుకుంటారా? లేదా? ఏం జరగనుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఏపీ రాకీయాల్లో బద్ధ శత్రువులుగా వ్యవహరించే ఇద్దరు కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నాను. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు.

CM Jagan Chandrababu Naidu : ఒకే వేదికపైకి సీఎం జగన్, చంద్రబాబు..! పలకరించుకుంటారా? లేదా? ఏం జరగనుంది
ad

CM Jagan Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఏపీ రాకీయాల్లో బద్ధ శత్రువులుగా వ్యవహరించే ఇద్దరు కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నాను. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు.

సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాజ్‌భవన్‌‌లో గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్ ఇచ్చే తేనీటి విందులో సీఎం, ప్రతిపక్ష నేత హాజరుకానున్నారు. సీఎం జగన్, చంద్రబాబు ఒకే వేదిక పంచుకోవడంపై ఇటు రాజకీయవర్గాల్లో అటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వీరు ఒకరితో మరొకరు మాట్లాడుకుంటారా? కనీసం పలకరించుకుంటారా.. లేదా? అని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వీరిద్దిరతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎట్ హోం కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ ముగ్గురు కీలక నేతలు ఇలా ఒకే వేదిక మీదకు రానుండటం రాజకీయంగా ఆసక్తి పెంచింది.

ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం నాడు గవర్నర్ రాజ భవన్ వేదికగా ఎట్ హోం నిర్వహించటం ఆనవాయితీ. రాష్ట్రంలో రాజకీయ, అధికార, పలు రంగాల ప్రముఖులను ఆహ్వానిస్తారు. వీరి గౌరవార్ధం గవర్నర్ తేనేటి విందు ఏర్పాటు చేస్తారు. ఇక ఈ ఏడాది ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ సీఎం జగన్, మంత్రులతో పాటుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, హైకోర్టు న్యాయమూర్తులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, శాసనమండలి ఛైర్మన్, శాసనసభ స్పీకర్ ను ఆహ్వానించారు గవర్నర్ విశ్వభూషణ్.