YSR Rythu Bharosa : చెక్ చేసుకోండి.. 50లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల కోట్లు జమ

వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం జగన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.2,096.04 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.

YSR Rythu Bharosa : చెక్ చేసుకోండి.. 50లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల కోట్లు జమ

YSR Rythu Bharosa : వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం జగన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.2,096.04 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.

ఏపీలో ఈ పథకం వరుసగా నాలుగో ఏడాది అమలవుతోంది. కాగా, ఈ ఏడాది మే నెలలో తొలి విడతగా రూ.7,500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు రెండో విడత సందర్భంగా రూ.4 వేల చొప్పున బదిలీ చేసింది.

ఇక మూడో విడతలో భాగంగా వచ్చే జనవరిలో రూ.2 వేల చొప్పున విడుదల చేయనున్నారు. రైతు భరోసా-పీఎం కిసాన్ లో భాగంగా ఏటా రైతుకు రూ.13,500 మేర సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.

రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందచేస్తోంది. వరుసగా నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్‌కు ముందే రూ.7,500 చొప్పున ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. రెండో విడతగా రూ.4వేలు నేడు అందించారు. సంక్రాంతి సమయంలో మూడో విడతగా మరో రూ.2,000 సాయాన్ని అందిస్తారు. రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 ప్రభుత్వం అందిస్తోంది.

రైతు భరోసా ద్వారా మొదటి విడతగా ఖరీఫ్‌ పంటలు వేసే ముందు మే నెలలో రూ.7,500 చొప్పున అందిస్తుండగా రెండవ విడతగా అక్టోబర్‌లో పంట కోతలు, రబీ అవసరాల కోసం రూ.4,000 చొప్పున అందిస్తారు. మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరిలో రూ.2,000 అకౌంట్‌లలో జమ చేస్తోంది. ఇప్పుడు అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే ఇప్పటివరకు ఒక్క వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర డబ్బులు అందించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ అన్నారు. ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నామని, ప్రతి అంశంలో అండగా ఉంటున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు ప్రజలు తేడా గమనించాలన్నారు జగన్.

”ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసింది. అక్టోబర్ 12 వరకు సాధారణం కంటే 4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. గతంలో సగటున 1.54 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే.. ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 167.24 లక్షల టన్నులకు చేరింది. భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి” అని జగన్ అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు తోడుగా ఉంటున్నామన్నారు జగన్. క్రమం తప్పకుండా ప్రతీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉందన్నారు. 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉందన్నారు. రూ.13,500 సాయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నామన్నారు. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు సీఎం జగన్‌. ”ఇప్పటికే మేలో రూ.7,500 ఇచ్చాం. ఇప్పుడు రూ. 4వేలు ఇస్తున్నాం. మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ.25,971 కోట్ల మేర లబ్ధి కలిగింది. మొత్తం 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం. ఒక్కో కుటుంబానికి ఇప్పటివరకూ రూ.51 వేలు అందించాం” అని జగన్ అన్నారు.