కడపకు సీఎం జగన్, మూడు రోజులు అక్కడే

కడపకు సీఎం జగన్, మూడు రోజులు అక్కడే

CM YS Jagan to tour Kadapa district : ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్.జగన్‌ మోహన్‌ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మూడ్రోజుల పాటు వైఎస్ఆర్‌ కడప జిల్లా (Kadapa Dist) లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం మధ్యాహ్నం 03 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసు నుంచి సీఎం వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనకు బయల్దేరుతారు. రాత్రి ఇడుపులపాయ ఎస్టేట్‌లో బస చేస్తారు. గురువారం ఉదయం వైఎస్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్ధనల్లో సీఎం జగన్‌ పాల్గొంటారు. ఆ తర్వాత చర్చిలో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు.

అనంతరం పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండు, డిపో నిర్మాణం, ఇండ్రస్టియల్‌ డెవలప్‌మెంట్‌ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 25 మధ్యాహ్నం కడప నుంచి విమానంలో రాజమండ్రి చేరుకుంటారు సీఎం. యూ.కొత్తపల్లిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. చాలా రోజుల తర్వాత జగన్‌ స్వస్థలానికి రానుండటంతో జిల్లాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలిసే అవకాశం ఉంది. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా వైఎస్ఆర్‌ కడప జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.