Andhra Pradesh : రాగల మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతున్నది.

Andhra Pradesh : రాగల మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు

Andhra Pradesh  : నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతున్నది. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 km ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి కొనసాగుతోంది.

చదవండి : Andhra Pradesh : జీతాలు ఆలస్యం కాకుండా చూస్తాం, ఈనెలాఖరులోగా పీఆర్సీ

దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు కర్ణాటక తీరానికి దగ్గరగా తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతములో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టానికి 4.5 km నుండి 5.8 km ఎత్తుల మధ్య కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

చదవండి : Andhra Pradesh : విద్యుత్ సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్..కరెంట్‌ కోతలు తప్పవా?