CM Jagan : పునీత్ రాజ్‌కుమార్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది

ఏపీ సీఎం జగన్ పునీత్ కుమార్ మరణంపై స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా సంతాపం తెలియజేశారు. పునీత్ కుటుంబసభ్యులకు..

CM Jagan : పునీత్ రాజ్‌కుమార్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది
ad

CM Jagan : ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. దీంతో శాండల్ వుడ్ షాక్ కి గురైంది. పునీత్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు పునీత్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.

ఏపీ సీఎం జగన్ పునీత్ కుమార్ మరణంపై స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా సంతాపం తెలియజేశారు. పునీత్ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం జగన్.

Puneeth Rajkumar : అదేపనిగా జిమ్ చేస్తున్నారా? పునీత్ గుండెపోటుకు కారణం ఏంటి?

పునీత్ మృతిపై టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఎంతో ప్రతిభావంతుడైన యువ నటుడు ఇంత త్వరగా ఈ లోకాన్ని వీడిపోయాడని, అతడి మరణవార్తతో తాను దిగ్భ్రాంతి చెందానని వెల్లడించారు. పునీత్ ను రెండు సార్లు కలిశానని, అతడి ఆతిథ్యం తనను ముగ్ధుడ్ని చేసిందని వివరించారు. ఎంతో వినయవిధేయతలు ఉన్న వ్యక్తి అని, చాలా నిరాడంబరంగా ఉంటాడని రాజమౌళి చెప్పారు. ఈ కష్ట సమయం నుంచి తేరుకునే శక్తిని అతడి కుటుంబానికి కలిగించాలని ఆ దేవుడ్ని ప్రార్థించారు.

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నట వారసుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ సోదరుడు.. పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. పునీత్‌కు భార్య అశ్విని రేవంత్.. కుమార్తెలు ధృతి, వందిత ఉన్నారు. పునీత్ మరణంతో కర్నాటక అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. శనివారం కంఠీరవ స్టూడియోలో తండ్రి సమాధి పక్కనే పునీత్ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

PF ఖాతాదారులకు కేంద్రం దీపావళి కానుక… 8.5శాతం వడ్డీకి ఆమోదం

ఒక లెజెండరీ యాక్టర్ కొడుకు, స్టార్ హీరో తమ్ముడు అయినా పునీత్ చాలా సామాన్యంగా ఉంటారనేది అందరూ చెప్పేమాట. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ సామాజిక సేవలో స్టార్ గా ఉన్నారు. పునీత్ చేసిన సామాజిక కార్యక్రమాల గురించి వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కర్నాటకలో ఒకటి, రెండు కాదు ఏకంగా 45 స్కూళ్లు, 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు పునీత్ సహకారంతో నడుస్తున్నాయి. అలాగే 1800 మంది విద్యార్థుల ఉచిత విద్యకు, మైసూరులోని ఆడపిల్లల చదువులకు ఆయన సాయం చేస్తున్నారు. ఇప్పుడు చనిపోతూ కూడా రెండు కళ్లూ దానం చేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.

సామాజిక సృహతో నటుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగా చెరగని ముద్ర వేసిన పునీత్ తన కళ్లను దానం చేశారు. పునీత్ రాజ్ కుమార్ కన్నుమూస్తూ కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని తన కళ్లను దానం చేశారనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలో తండ్రి రాజ్ కుమార్ కూడా కళ్లు డొనేట్ చేశారు. పునీత్ పలు ఐ క్యాంపెయిన్లలో కూడా పాల్గొన్నారు.

శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తుండగా పునీత్ కుప్పకూలిపోయారు. తీవ్రస్థాయిలో ఛాతీలో నొప్పి రావడంతో పునీత్ ను సహాయకులు, జిమ్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందించారు. నిపుణులైన వైద్య బృందం పునీత్ ను బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికి ప్రయోజనం లేకపోయింది.