చంద్రబాబు ఇంటి వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్

  • Published By: vamsi ,Published On : June 14, 2020 / 02:39 AM IST
చంద్రబాబు ఇంటి వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నగరంలో నివసించే ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొని వచ్చిన కానిస్టేబుల్‌‌కి కరోనా సోకింది.

గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కానిస్టేబుల్‌.. మే 5వ తేదీన విధుల నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లి జూన్ 7వ తేదీన తిరిగి వచ్చారు. 

ఈ క్రమంలో బాపట్ల పట్టణ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌‌కు అనుమానిత లక్షణాలు ఉండడంతో మూడు రోజుల క్రితం పరీక్షలు చేశారు.

శనివారం వచ్చిన ఫలితాల్లో అతనికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. హైదరాబాద్‌లో తోటి కానిస్టేబుల్‌ నుంచి అతనికి సోకినట్లుగా తెలుస్తుంది.