ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు

ఈ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు వస్తుంటాయని.. ఈసారి కొంచెం ఎక్కువగా ఉండటంతో ప్రజలు గుర్తించగలిగారని

  • Edited By: veegamteam , January 1, 2019 / 10:26 AM IST
ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు

ఈ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు వస్తుంటాయని.. ఈసారి కొంచెం ఎక్కువగా ఉండటంతో ప్రజలు గుర్తించగలిగారని

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. పెదచెర్లోపల్లి మండలం పెద్ద అలవలపాడులో భూమి కంపించటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. 2019, జనవరి 1వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూమి కంపించింది. అప్పటి వరకు కొత్త ఏడాది సంబరాల్లో ఉన్న ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. 

పెదచెర్లోపల్లి మండలం చుట్టుపక్కల ప్రాంతం రాతితో ఉంటుంది. భూ పొరల్లో మార్పుల వల్ల కంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు వస్తుంటాయని.. ఈసారి కొంచెం ఎక్కువగా ఉండటంతో ప్రజలు గుర్తించగలిగారని ప్రకటించారు. ఇప్పుడు వచ్చిన భూ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. ప్రమాదం జరిగే స్థాయిలో ఇవి లేవని తెలిపారు. పలుమార్లు ఇలాగే భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అధికారులు.