AP PRC : అన్యాయం జరిగింది, పీఆర్సీని అంగీకరించం.. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ

పీఆర్సీ వ్యవహారం అప్పుడే కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. పీఆర్సీ పై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహంగా ఉంది.

AP PRC : అన్యాయం జరిగింది, పీఆర్సీని అంగీకరించం.. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ

Ap Prc Reject

AP PRC : పీఆర్సీ వ్యవహారం అప్పుడే కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. పీఆర్సీ పై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహంగా ఉంది. హాట్ కామెంట్స్ చేసింది. తమకు అన్యాయం జరిగిందని వాపోయింది. పీఆర్సీని తాము అంగీకరించడం లేదని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ బాలకాశి చెప్పారు. ప్రభుత్వం నిన్న ఇచ్చిన పీఆర్సీ మేము అంగీకరించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

Chilli : మిరప కారం అధికంగా తింటే… వృద్ధాప్య ఛాయలు

”ఎన్నికల వాగ్దానంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తామన్నారు. నిన్నటి సమావేశంలో మాకు న్యాయం జరగలేదు. నిన్నటి ఒప్పందం మా పట్ల దగాకోరు ఒప్పందం. రేపు జిల్లా కలక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు చేస్తాం. జేఏసీ నాయకత్వాన్ని లొంగదీసుకున్నారు.

Sajjala Ramakrishnareddy : అన్ని విషయాలు చర్చల్లో అంగీకరించి.. బయటకెళ్లి మళ్లీ ఆందోళనంటున్నారు

లక్షమంది వరకూ ఉద్యోగులు ఛలో విజయవాడ ప్రదర్శనలో పాల్గొన్నారు. జేఏసీ నాయకత్వం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రస్తావన లేకుండా ఒప్పందం చేసుకుంది. ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణతో కలిసి సమన్వయంతో ఉద్యమం చేస్తాం. ఇప్పటిదాకా నమ్మిన నాయకత్వం నడిరోడ్డు మీద వదిలేసింది. ఎన్నికల ముందు సీఎం జగన్ చేసిన హామీలను సాధించుకోవడానికి ఉద్యమిద్దాం. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులేషన్ కు ఏర్పాటు చేసిన కమిటీ ఏం చేస్తోంది? ఆరుగురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్ ల కమిటీ నిద్ర పోతోంది” అని బాలకాశి అన్నారు.

AP PRC ISSUE: చర్చల్లో ఒకే అని ఇపుడు ఇలా అంటారేంటి: సూర్యనారాయణ

ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ విషయంపై సీఎం జగన్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో శనివారం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో చర్చల అనంతరం సమ్మె నిర్ణయాన్ని విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. అయితే స్టీరింగ్ కమిటీ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు యూ టర్న్ తీసుకున్నాయి. ఉపాధ్యాయుల సమస్యలపై స్టీరింగ్ కమిటీ సభ్యులు పక్షపాత ధోరణితో వ్యవహరించారంటూ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఫిట్ మెంట్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక కార్యాచరణతో మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపాధ్యాయ సంఘాలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి.

ఉపాధ్యాయ సంఘాలు యూ టర్న్ తీసుకోవడంపై జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ స్పందించారు. శనివారం రాత్రి తమతో పాటు సీఎం వద్ద చర్చల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు.. అప్పుడు అంతా ఓకే అని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామని స్టేట్ మెంట్లు ఇవ్వడంపై సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఫిట్ మెంట్ తప్పించి మిగిలిన అన్ని విషయాల్లో మేము అనుకున్నవి సాధించామని సూర్యనారాయణ అన్నారు.

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ విధంగా చేస్తున్నారని సూర్యనారాయణ ఆరోపించారు. మిగతా ఉద్యోగ సంఘాలపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏ ఒక్కరి వలనో ఉద్యమం విజయవంతం అయిందనే భావన సరికాదన్నారు. ఉపాధ్యాయ సంఘాల బాధని మేము అర్థం చేసుకున్నామని, సమస్యని ఇంతకంటే జటిలం చేయడం సబబు కాదని సూర్యనారాయణ సూచించారు.

ఉపాధ్యాయ సంఘాల నేతలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఫిట్ మెంట్ పెంచాలని టీచర్ సంఘాల నేతలు కోరారు.. ఆర్ధిక ఇబ్బందులతో పెంచే పరిస్థితి లేదని చెప్పామని సజ్జల అన్నారు. అన్ని విషయాలు చర్చల్లో అంగీకరించారు.. బయటకి వెళ్లి మళ్ళీ ఆందోళన అంటున్నారు, ఇది కరెక్ట్ కాదన్నారు. ఇంతకంటే ఎక్కువ చేసే పరిస్థితి ప్రస్తుతం లేదని ఆయన స్పష్టం చేశారు. వారికి ఇబ్బంది ఉంటే చర్చల్లో చెప్పాల్సింది.. ఒప్పందం అయ్యాక బయటకి వెళ్లి మాట్లాడడం సరికాదన్నారు.