మంత్రి వెల్లంపల్లి చుట్టే తిరుగుతున్న వివాదాలు.. పార్టీ నేతలు, సీనియర్‌ మంత్రులు ఆగ్రహం

మంత్రి వెల్లంపల్లి చుట్టే తిరుగుతున్న వివాదాలు.. పార్టీ నేతలు, సీనియర్‌ మంత్రులు ఆగ్రహం

Controversies revolve around Minister Vellampalli : మంత్రి వెల్లంపల్లిపై అధికార పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోందా..? సహచర మంత్రులే వెల్లంపల్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా..? తరచూ వివాదాలు ఏంటంటూ సీనియర్ మంత్రులు వెల్లంపల్లికి క్లాస్ ఇచ్చారా..? ఇంతకీ వెల్లంపల్లిపై సీనియర్‌ మంత్రులు ఎందుకు ఆగ్రహం ఉన్నారు..? మంత్రి వెల్లంపల్లి చుట్టూ వివాదాలే.. అటు పొలిటికల్ సైడ్.. ఇటు డిపార్ట్మెంట్ సైడ్ మంత్రికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ పక్క దేవాలయాలపై, దేవుడి విగ్రహాలపై దాడులు జరుగుతుండటం.. వాటిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో మంత్రి చుట్టూ వివాదాలు రావడం ఇబ్బందిగా మారాయి.

ముందు నుంచీ ప్రతిపక్షాలు వెల్లంపల్లిని టార్గెట్ చేశాయి. ఒక పక్క టీడీపీ, మరోపక్క జనసేన, బీజేపీ దొరికినప్పుడల్లా మంత్రిపై గట్టిగా విమర్శలు చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మంత్రి చుట్టూ వివాదాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మంత్రి చుట్టూ అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దుర్గగుడిలో అవినీతితో సహా నగరంలో అనేక అంశాల్లో మంత్రి ప్రధాన అనుచరులు ఉన్నట్లు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే సొంత పార్టీలోనే వెల్లంపల్లి తీరుపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. చాలామంది పార్టీ నేతలతో పాటు మంత్రులు వెల్లంపల్లి తరచుగా వివాదాల్లోకి వెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఆయన చుట్టూ వచ్చే అవినీతి ఆరోపణలపై కొందరు సీనియర్ మంత్రులు నేరుగా పిలిచి క్లాస్ తీసుకున్నరని కూడ తెలుస్తోంది. ఇలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాలని.. ప్రభుత్వానికి, మిగతా మంత్రులకు చెడ్డ పేరు వస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. గతంలోనూ అవినీతి ఆరోపణలపై వెల్లంపల్లిని మందలించారట సీనియర్ మంత్రులు. జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు తప్పవని కూడా చెప్పేశారట. మరి చూడాలి నెక్స్ట్‌ సీన్‌ ఏంటనేది..!