శభాష్ పోలీస్ – రుణ యాప్ ల నిందితుడైన కొడుకును పట్టిచ్చిన ఏఎస్సై

శభాష్ పోలీస్ – రుణ యాప్ ల నిందితుడైన కొడుకును పట్టిచ్చిన ఏఎస్సై

cop father help cyber crime police, arrested his criminal son : కరోనా కష్టకాలంలో ఏర్పడ్డ ఆర్ధిక కష్టాలు గట్టెక్కటానికి పలువురు రుణయాప్ ల బారినపడి లబో దిబో మంటున్నారు.రుణయాప్ ల నిర్వాహకులు పెట్టే వత్తిడి తట్టుకోలేక కొందరు చిన్నవయస్సులోనే బలవన్మరణాలకు పాల్పడ్డారు. చైనా కంపెనీలు కేవలం ఆర్నెల్లలో రూ.21 వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు లెక్కలు తేలాయి. లోన్ యాప్ ల కేసులో రెండు రోజుల క్రితం చైనా దేశీయుడు ల్యాంబోను పోలీసులు అరెస్టు చేశారు.

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ల్యాంబో కంపెనీల ఆర్ధిక వ్యవహారాలను కర్నూలుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి పర్యవేక్షిస్తున్నాడు. అతని సోదరుడు ఈశ్వర్ కుమార్ కూడా ఇదే కంపెనీలో పని చేస్తున్నాడు. వీరి తండ్రి కర్నూలు జిల్లాలో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. కాగా నాగరాజును రెండురోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగరాజు అరెస్ట్ వెనుక అతని తండ్రి వృత్తి ధర్మాన్ని పాటించి కన్నకొడుకును పొలీసులకు పట్టించారు.

గత కొన్ని రోజులుగా రుణయాప్ లవార్తలు వింటున్ననాగరాజు తండ్రి తన కుమారుడి వ్యవహారాల్ని పరిశీలించటం మొదలెట్టారు. అతడిపై అనుమానం వచ్చింది. ఈలోగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాగరాజు విషయంలో ఆయన్ను సంప్రదించారు. తను కన్నకుమారుడు పరోక్షంగా లక్షల మందిని మోసం చేశాడని నిర్ధారించుకున్నారు. ఈవిషయం కుమారుడికి చెప్పకుండా ఆయన, బెంగుళూరులో రుణయాప్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడిని కర్నూలు రావాలని కోరారు.

3 రోజుల క్రితం కుమారుడు ఇంటికి వచ్చాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేంతవరకు కుమారుడు ఇల్లుదాటి బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడి… పోలీసులు రాగానే కుమారుడ్ని వారికి అప్పగించి అరెస్ట్ చేయించారు. పేగు బంధం కంటే వృత్తి బాధ్యత గొప్పదని భావించిన ఆయనకు సైబర్ క్రైమ్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

ఏఎస్సైగా పని చేస్తున్నతన వివరాలు బయటకు రానివ్వవద్దని ఆయన పోలీసు అధికారులను వేడుకున్నారు. పోలీసులు తమ్ముడు నాగరాజును అరెస్ట్ చేయటంతో అదే కంపెనీలో పని చేస్తున్న అన్న ఈశ్వర్ కుమార్ కూడా పోలీసులకు స్వఛ్చందంగా లొంగిపోయినట్లు తెలుస్తోంది.