ఒంగోలులో కరోనా కలకలం

ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కలకలం రేగింది. కరోనా లక్షణాలతో ఓ యువకుడు రిమ్స్ లో చేరాడు. ఇటీవలే ఆ యువకుడు లండన్ నుంచి ఒంగోలు వచ్చాడు. జ్వరం,

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 02:03 AM IST
ఒంగోలులో కరోనా కలకలం

ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కలకలం రేగింది. కరోనా లక్షణాలతో ఓ యువకుడు రిమ్స్ లో చేరాడు. ఇటీవలే ఆ యువకుడు లండన్ నుంచి ఒంగోలు వచ్చాడు. జ్వరం,

ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కలకలం రేగింది. కరోనా లక్షణాలతో ఓ యువకుడు రిమ్స్ లో చేరాడు. ఇటీవలే ఆ యువకుడు లండన్ నుంచి ఒంగోలు వచ్చాడు. జ్వరం, జలుబు, దగ్గుతో అతడు బాధ పడుతున్నాడు. దీంతో రిమ్స్ లో చేరాడు. ప్రత్యేక వార్డులో వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఆ యువకుడి రక్త నమూనాలు సేకరించిన అధికారులు ల్యాబ్ కి పంపారు. రిపోర్టు కోసం వెయిట్ చేస్తున్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ల్యాబ్ లు, ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది. పరిశుభ్రతపై ఫోకస్ పెట్టింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఆ దేశంలో కంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఎక్కువ ప్రాణాలను బలిగొంటుంది. చైనాలో కంటే మిగిలిన దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువని, చనిపోతున్న వారి శాతం కూడా ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది.

పెరుగుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య:
ఏఎఫ్‌పీ వార్తాసంస్థ లెక్కల ప్రకారం కరోనా వైరస్ 162 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 82వేల 547 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6వేల 163 మందికి సీరియస్ గా ఉంది. మరణాల సంఖ్య 7వేల 164కు చేరుకుంది. అందులో చైనాలో 3,226 మంది మరణించగా, ఇటలీలో 2,158, ఇరాన్‌లో 853, స్పెయిన్‌లో 342 మంది చనిపోయారు. వైరస్‌ అని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించాలని డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికే ప్రపంచ దేశాలకు సూచనలు చేసింది.

చైనా కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువ:
ఫ్రాన్స్‌లో తొలివారం 12గా ఉన్న నిర్ధారిత కేసుల సంఖ్య నాలుగు వారాల్లో 4వేల 500కి పెరిగింది. ఇరాన్‌లో ఈ సంఖ్య 12వేల 700కి చేరింది. ఇటలీలో 24వేల మందికి వైరస్‌ సోకింది. ఇటలీలో మృతుల సంఖ్య 2వేలు దాటింది. స్పెయిన్‌లోనూ నాలుగు వారాల వ్యవధిలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8 నుంచి 6 వేలకు పెరిగింది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య తక్కువే. అయినా ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో 124 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 39 కరోనా కేసులు నమోదయ్యాయి.

Also Read | తెలంగాణలో మరో వ్యక్తికి కరోనా..స్కాట్‌లాండ్‌ వెళ్లొచ్చిన వ్యాపారికి వైరస్