గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. భారీగా పెరిగిన రికవరీ రేటు

  • Published By: naveen ,Published On : September 29, 2020 / 05:12 PM IST
గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. భారీగా పెరిగిన రికవరీ రేటు

corona cases in telugu states: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇన్నాళ్లూ ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన కరోనావైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు భారీగా తగ్గాయి. అలాగే డెత్ రేట్ తగ్గింది. అదే సమయంలో రికవరీ రేటు భారీగా పెరిగింది.

టెస్టులు పెరగడంతో కేసులు తగ్గుతున్నాయి:
ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఏపీలో పాజిటివ్ రేటు 12 నుంచి 8.3శాతానికి తగ్గింది. టెస్టులు పెరగడంతో కేసులు తగ్గుతున్నాయని సీఎం జగన్ అన్నారు. కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 2021 జనవరి కల్లా కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు జగన్. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌కు ఉచిత వైద్యం అందిస్తున్నది ఏపీనే అని చెప్పారు. కోవిడ్‌ ఆసుపత్రుల జాబితా గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని జగన్ చెప్పారు.

కరోనా టెస్టుల్లో ఏపీ నెంబర్ 1:
ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందన్నారు సీఎం జగన్‌. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్పందన కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా పరీక్షలు అత్యధికంగా చేసిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంటుందన్నారు. రాష్ట్రంలోని కరోనా పాజిటివ్‌ రేటు 12.02 శాతం నుంచి 8.3శాతానికి తగ్గిందన్నారు.

తెలంగాణలో కరోనా తగ్గుముఖం:
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు డైరెక్టర్‌ ఆఫ్ హెల్త్‌ శ్రీనివాస్‌. అలాగే మరణాల సంఖ్య కూడా తగ్గిందన్నారు. జూన్‌లో అత్యధికంగా పాజిటివ్ పర్సెంటేజ్ నమోదైందన్నారు. జూన్‌లో 23 శాతం పాజిటివ్ కేసులు నమోదు కాగా సెప్టెంబర్‌లో ఆ సంఖ్య 4శాతానికి పడిపోయిందన్నారు. రికవరీ రేటు కూడా తెలంగాణలో ఎక్కువగానే ఉందన్నారు‌.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది- సీఎం జగన్
పాజిటివ్‌ రేటు 12.02 శాతం నుంచి 8.3శాతానికి తగ్గింది-సీఎం
అత్యధిక పరీక్షలు చేసిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంటుంది-సీఎం
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
సెప్టెంబర్‌లో తగ్గుతాయని ముందే చెప్పిన తెలంగాణ ఆరోగ్య శాఖ
తగ్గిన పాజిటివ్ కేసులు, పెరిగిన రికవరీ రేటు- శ్రీనివాస్‌, డైరెక్టర్ ఆఫ్ హెల్త్
జూన్‌లో అత్యధికంగా పాజిటివ్ పర్సంటేజ్‌
జూన్‌లో 23%, ఆగస్ట్‌లో 7%, సెప్టెంబర్‌లో 4శాతానికి పడిపోయిన కేసుల సంఖ్య
కరోనా కేసులు తగ్గినా, జాగ్రత్తలు తప్పనిసరి-శ్రీనివాస్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్

కొవిడ్ కేసులు తగ్గుతాయన్న అంచనాలు నిజమవుతున్నాయి:
కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్ శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రతి 10లక్షల మందిలో 79వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ కోఠిలోని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ కార్యాలయంలో డీఎంఈ రమేశ్‌రెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.

జూన్‌లో కరోనా పాజిటివ్‌ రేటు అత్యధికంగా 23 శాతం నమోదు కాగా.. సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు 4శాతం మాత్రమే ఉందన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి కొవిడ్ కేసులు తగ్గుతాయన్న అంచనాలు నిజమవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో రోజుకు సగటున 55వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు శ్రీనివాస్‌ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 15.42 శాతం మాత్రమే యాక్టివ్ కేసులున్నాయని చెప్పారు.

కరోనా రికవరీ రేటు జాతీయ స్థాయి కంటే తెలంగాణలోనే అధికం:
కరోనా రికవరీ రేటు జాతీయస్థాయి కంటే తెలంగాణలోనే అధికంగా ఉందని శ్రీనివాస్‌ చెప్పారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.59 శాతం మాత్రమే ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 230 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 25 శాతం బెడ్స్ నిండాయని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం మంది పొరుగు రాష్ట్రాల వారు చికిత్స పొందుతున్నారని శ్రీనివాస్‌ వివరించారు. కరోనా సోకిన తర్వాత సైతం ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.