AP Corona Cases : ఏపీలో పెరిగిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,737 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,179 మందికి కరోనా పాజిటివ్‌గ

AP Corona Cases : ఏపీలో పెరిగిన కరోనా కేసులు

Ap Corona

AP Corona Cases : ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,737 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,179 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతి చెందారు. ఇదే సమయంలో.. 1,651 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 2,78,13,498కు చేరగా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,40,408కు పెరిగింది.

ఇక, రికవరీ కేసులు 20,12,714కు చేరగా.. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,089కు చేరింది. రాష్ట్రంలో 13,905 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. ఇక విజయనగరం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చింది. సోమవారం ఇక్కడ ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. మంగళవారం 1 కరోనా కేసు నమోదైంది.

Read More : Revanth Reddy: కేటీఆర్‌పై ఆరోపణలు చేయొద్దు.. రేవంత్ రెడ్డిని ఆదేశించిన కోర్టు
జిల్లాల వారీగా నమోదైన కేసులను ఒకసారి పరిశీలిస్తే

అనంతపురం – 8, చిత్తూరు – 190, తూర్పుగోదావరి – 192, గుంటూరు – 107, కడప – 30, కృష్ణా – 167, కర్నూలు – 2, నెల్లూరు – 131,ప్రకాశం – 124, శ్రీకాకుళం – 19, విశాఖపట్నం – 47, విజయనగరం – 1, పశ్చిమ గోదావరి – 161,

Read More : ‘Chicken Parenting’ : చైనాలో కొత్త ట్రెండ్..పిల్ల‌ల‌కు కోడి రక్తం ఇంజెక్ష‌న్స్ చేయిస్తున్న పేరెంట్స్

మృతులు

చిత్తూరు –3, కృష్ణా – 2, నెల్లూరు – 2, ప్రకాశం – 2 తూర్పుగోదావరి – 1, గుంటూరు – 1