Andhra Pradesh : ఏపీలో కరోనా కేసులు..24 గంటల్లో 22 వేల 517 కేసులు

ఏపీ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 22 వేల 517 మందికి కరోనా సోకింది.

Andhra Pradesh : ఏపీలో కరోనా కేసులు..24 గంటల్లో 22 వేల 517 కేసులు

Andhra Pradesh

COVID-19 Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 22 వేల 517 మందికి కరోనా సోకింది. 98 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో 2, 07, 467 యాక్టివ్ కేసులు ఉండగా..9 వేల 271 మంది చనిపోయారు.

అనంతపురం జిల్లాలో అత్యధికంగా 12 మంది వైరస్ తో చనిపోయారు. నెల్లూరులో 11, తూ.గో. జిల్లాలో 10 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 18,739 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 1,78,80,755 శాంపిల్స్ చేసినట్లు వెల్లడించింది.

దీని కారణంగా అనంతపూర్ లో 12 మంది, నెల్లూరులో 11 మంది, తూర్పు గోదావరిలో 10 మంది, విశాఖపట్టణంలో 9 మంది, విజయనగరంలో 9 మంది, చిత్తూరులో 8 మంది, శ్రీకాకుళంలో 8 మంది, గుంటూరులో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం 14,08,425 పాజిటివ్ కేసులకు గాను..11 లక్షల 91 వేల 687 మంది డిశ్చార్జ్ కాగా..9 వేల 271 మంది మృతి చెందారని..ప్రస్తుతం 2,07,467 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 2975. చిత్తూరు 2884. ఈస్ట్ గోదావరి 3383. గుంటూరు 1750. వైఎస్ఆర్ కడప 1647. కృష్ణా 1054. కర్నూలు 1102. నెల్లూరు 985. ప్రకాశం 1305. శ్రీకాకుళం 1240. విశాఖపట్టణం 1984. విజయనగరం 992. వెస్ట్ గోదావరి 1216. మొత్తం : 22,517.