Andhrapradesh : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఏపీలో 24 గంటల వ్యవధిలో 21 వేల 452 మందికి కరోనా సోకింది. 89 మంది చనిపోవడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.

Andhrapradesh : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Corona Ap

COVID-19 Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా వేవ్ అర్థం కావడం లేదు. ఒకరోజు తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసుు నమోదవుతుంటుంటే..మరోరోజు..ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. తెలియని పరిస్థితి నెలకొంది. 24 గంటల వ్యవధిలో 21 వేల 452 మందికి కరోనా సోకింది.

89 మంది చనిపోవడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 90 వేల 750 శాంపిల్స్ పరీక్షించగా..21 వేల 452 మంది కరోనా బారిన పడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీని కారణంగా విశాఖపట్టణంలో 11 మంది, తూర్పు గోదావరి లో 9 మంది, కృష్ణాలో 9 మంది, విజయనగరంలో 9 మంది, చిత్తూరులో 8 మంది, గుంటూరులో 8 మంది, నెల్లూరులో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, వెస్ట్ గోదావరిలో ముగ్గురు, కడపలో ఇద్దరు మరణించారు.

గడిచిన 24 గంటల్లో 19 వేల 095 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని వెల్లడించింది. నేటి వరకు రాష్ట్రంలో 1,76,05,687 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం 13,41,491 పాజిటివ్ కేసులకు గాను..11 లక్షల 35 వేల 133 మంది డిశ్చార్జ్ కాగా..8 వేల 988 మంది మృతి చెందారని..ప్రస్తుతం 1,97,370 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 2185. చిత్తూరు 1908. ఈస్ట్ గోదావరి 2927. గుంటూరు 1836. వైఎస్ఆర్ కడప 1746. కృష్ణా 997. కర్నూలు 1524. నెల్లూరు 1689. ప్రకాశం 1192. శ్రీకాకుళం 1285. విశాఖపట్టణం 2238. విజయనగరం 693. వెస్ట్ గోదావరి 1232. మొత్తం : 21,452.