ఏపీలో 252కు చేరిన కరోనా కేసులు…24 గంటల్లో 60 మందికి పాజిటివ్ 

మర్కజ్‌ సదస్సు ఏపీ కొంప ముంచింది. ఏపీలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసులు 252కు చేరాయి.

  • Published By: veegamteam ,Published On : April 5, 2020 / 09:24 PM IST
ఏపీలో 252కు చేరిన కరోనా కేసులు…24 గంటల్లో 60 మందికి పాజిటివ్ 

మర్కజ్‌ సదస్సు ఏపీ కొంప ముంచింది. ఏపీలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసులు 252కు చేరాయి.

మర్కజ్‌ సదస్సు ఏపీ కొంప ముంచింది. ఏపీలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసులు 252కు చేరాయి. 24 గంటల్లో 60 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలులో అత్యధికంగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు- 34, గుంటూరు- 30, కృష్ణా- 28, ప్రకాశం- 23, కడప- 23, చిత్తూరు-17, విశాఖ- 15, పశ్చిగో-15 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి- 11, అనంతపురం-3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.(ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 400 దాటినా లాక్‌డౌన్‌ లేదు)

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలతో ఎవరు వచ్చినా చికిత్స అందించాలన్నారు. కరోనా నియంత్రణపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌  సమీక్ష నిర్వహించారు. 

ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చినవారిని గుర్తించి త్వరగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి ఆరోగ్య సర్వే నిరంతరం జరుగుతుండాలని ఆదేశించారు. కరోనా వ్యక్తులకు చికిత్స అందించే సమయంలో వైద్యసిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.