COVID-19 AP : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..99 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలే 20 వేల కేసులకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న 12 వేల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల 18 వేల 285 మందికి కరోనా సోకింది. 99 మంది చనిపోయారు.

COVID-19 AP : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..99 మంది మృతి

Corona Cases Rise Again In Ap 24 Hrs 99 Deaths

COVID-19 Cases AP : ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలే 20 వేల కేసులకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న 12 వేల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల 18 వేల 285 మందికి కరోనా సోకింది. 99 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం 16,24,495 పాజిటివ్ కేసులకు 14, 21, 964 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1, 92, 104గా ఉంది. గడిచిన 24 గంటల్లో 91, 120 శాంపిల్స్ చేయగా..18 వేల 285 మంది కోవిడ్ బారిన పడ్డారు. 24 గంటల్లో 24 వేల 105 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా మృతుల వివరాలు :
చిత్తూరులో 15 మంది, పశ్చిమ గోదావరిలో 14 మంది, విజయనగరంలో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, తూర్పు గోదావరిలో ఎనిమిది మంది, నెల్లూరులో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, విశాఖపట్టణంలో ఎనిమిది మంది, కర్నూలులో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు మరణించారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 1876. చిత్తూరు 1822. ఈస్ట్ గోదావరి 3296. గుంటూరు 1211. వైఎస్ఆర్ కడప 877. కృష్ణా 652. కర్నూలు 1026. నెల్లూరు 1159. ప్రకాశం 1056. శ్రీకాకుళం 1207. విశాఖపట్టణం 1800. విజయనగరం 639. వెస్ట్ గోదావరి 1664. మొత్తం : 18,285.

 

 

Read More : CM KCR : జూడాల సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు