Corona Curfew : రాష్ట్ర సరిహద్దులు బంద్, బయట కనిపిస్తే కేసులు

రాష్ట్రంలో విలయం సృష్టిస్తున్న కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. మ.12 తర్వాత అన్నీ బంద్ కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు కూడా నిలిచిపోనున్నాయి. మ.12

Corona Curfew : రాష్ట్ర సరిహద్దులు బంద్, బయట కనిపిస్తే కేసులు

Corona Curfew

Corona Curfew : రాష్ట్రంలో విలయం సృష్టిస్తున్న కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. మ.12 తర్వాత అన్నీ బంద్ కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు కూడా నిలిచిపోనున్నాయి. మ.12 నుంచి తర్వాతి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కాగా, మ.12 తర్వాత రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేయనున్నారు. అంతేకాదు 12గంటల తర్వాత అకారణంగా రోడ్లపై తిరిగే వారిపై కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలతో పాటు సంస్థలు, కార్యాలయాలు స్వచ్చందంగా కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు, వ్యాపారాలకు ప్రభుత్వం అనుమతించింది. మధ్యాహ్నం 12 తర్వాత అత్యవసర సేవలు తప్ప మిగిలిన అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. మధ్యాహ్నం 12 తర్వాత ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్, ఆటోలు, ఇతర ప్యాసింజర్ సర్వీసులన్నీ నిలిచిపోతాయి. వివిధ పనుల మీద బయటకు వెళ్లే ప్రజలు మధ్యాహ్నం 12గంటలలోపు పనులన్నీ ముగించుకొని ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని.. కర్ఫ్యూ సమయంలో రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే డిశ్చార్జిల సంఖ్య కూడా పెరుగుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశం. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 1,15,784 శాంపిల్స్ ని పరీక్షించగా 20,034 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24గంటల్లో 82 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 8,289 కి చేరింది.