కరోనా ఎఫెక్ట్ : ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు మూసివేత

కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయనున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 12:01 PM IST
కరోనా ఎఫెక్ట్ : ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు మూసివేత

కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయనున్నారు.

కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నివారణ చర్యలకు ఉపక్రమించించింది. వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఏపీలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలను బలోపేతం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను వెంటనే మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోచింగ్ సెంటర్లతో సహా అన్నీ మూసివేయాలని ఆదేశిచారు. కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి పివి.రమేశ్ తెలిపారు. మహమ్మారిని తగ్గించడానికి అందరూ దోహదం చేయాలని సూచించారు.

ఏపీలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కమిటీ వేసింది. వైద్య,ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి కన్వీనర్‌గా ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీని సీఎస్‌ నీలం సహాని వేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఇళ్లలో ఉండాలని చెప్పామని, వారి కోసం హోమ్‌ ఐసోలేటెడ్‌ చర్యలు చేపట్టామన్నారు.

ఇప్పటివరకు 7 వేల మంది తెలుగు వారు విదేశాల నుంచి ఏపీకి వచ్చారని వెల్లడించారు. విదేశాలనుండి వచ్చిన వారిని 14 రోజులు క్వారెంటైన్‌ ఫెసిలీటీస్‌లో ఉంచి వ్యాధి లక్షణాలు లేవని తెలిసిన తరువాతే ఇళ్లకు పంపుతున్నామన్నారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు.కర్నూలు జిల్లాలో ముగ్గురు యువకులు తీవ్ర జ్వరం, జలుబుతో ఆస్పత్రిలో చేరారు.

కెనడా, జర్మనీ నుంచి వచ్చిన ఇద్దరికి, ఇటలీ నుంచి వచ్చిన మరో యువకుడికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించారు వైద్యులు. ఇద్దరికి కరోనా లక్షణాలు లేవని నిర్దారించిన వైద్యులు.. మరొకరి శాంపిల్స్‌ను తిరుపతికి పంపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 12 రైళ్లను రద్దు చేసింది.  హైదరాబాద్‌-కలబురగి, కరీంనగర్‌-ముంబై, చెన్నై-శాంత్రాగచ్చి, చెన్నై-సికింద్రాబాద్‌, ముంబై- నాగ్‌పూర్‌, ముంబై-అజ్ని ట్రైన్‌ సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

కరోనా వైరస్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జనసమూహాలు ఎక్కువగా ఉండే వాటిని బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా 2020, మార్చి 16వ తేదీ నుంచి స్కూళ్లు, థియేటర్లు, పబ్‌లు బంద్ కానున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో మూడు కేసులు నమోదయ్యాయి. వ్యాధి నయం కావడంతో ఇప్పటికే ఒకరిని డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. 

See Also | కరోనా కారణంగా సమన్లు ​​పాటించలేరు…రెవెన్యూ డిపార్ట్మెంట్ కు కంపెనీలు,బ్యాంకులు,NBFC నోటీసులు