కరోనా ఎఫెక్ట్, మాస్కులతో పెళ్లి చేసుకున్న కొత్త జంట

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ అటాక్ చేస్తుందోనని

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 04:11 PM IST
కరోనా ఎఫెక్ట్, మాస్కులతో పెళ్లి చేసుకున్న కొత్త జంట

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ అటాక్ చేస్తుందోనని

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ అటాక్ చేస్తుందోనని హడలిపోతున్నారు. కరోనా కారణంగా అందరూ తమ ముఖ్యమైన పనులను సైతం వాయిదా వేసుకుంటున్నారు. కరోనా వ్యాపించకుండా స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూసేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ పెళ్లిళ్లపైనా పడింది. కొందరు పెళ్లిళ్లు పోస్టుపోన్ చేసుకుంటున్నారు.

కాగా, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం ఓ కొత్త జంట ధైర్యం చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని పెళ్లి చేసుకుంది. వరుడు, వధువు మాస్కులు ధరించి వివాహం చేసుకున్నారు. ఆ ఇద్దరే కాదు వివాహ వేడుకకి వచ్చిన బంధుమిత్రులు, ఆఖరికి పెళ్లి జరిపించిన పురోహితుడు కూడా మాస్క్ ధరించి పెళ్లి తంతు ముగించాడు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో ఈ వివాహం జరిగింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ కొత్త జంట చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. కరోనాపై అందరికి అవగాహన కల్పించేలా ఉందని అభినందించారు. కరోనా వైరస్ ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు. పలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదంటున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్కులు ధరించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలతో కరోనాని నివారించొచ్చని చెబుతున్నారు.

2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో కరోనా వెలుగు చూసింది. రోజుల వ్యవధిలోనే చైనాని సర్వ నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం 100కు పైగా దేశాల్లో కరోనా వ్యాపించింది. 4వేల మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా కరోనా బారిన పడ్డారు. భారత్ లోనూ కరోనా విజృంభిస్తోంది. గురువారం(మార్చి 12,2020) నాటికి మన దేశంలో 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ కనుక్కోలేదు. దీంతో కరోనా గురించి అంతా ఆందోళన చెందుతున్నారు.

1