కరోనా భయం..భయం : ఏపీలో వారం రోజుల పాటు స్కూల్స్ బంద్!

  • Published By: madhu ,Published On : March 15, 2020 / 08:24 AM IST
కరోనా భయం..భయం : ఏపీలో వారం రోజుల పాటు స్కూల్స్ బంద్!

ప్రపంచాన్ని కరోనా భయం వీడడం లేదు. వైరస్ విజృంభిస్తూ..వేలాది మందిని బలిగొంటోంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాపించింది. 100 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. ఏపీ రాష్ట్రంలో అనుమానితుల సంఖ్య పెరుగుతుండడం, నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

ఇప్పటికే నెల్లూరు జిల్లాలో స్కూల్స్, థియేటర్లు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో పూర్తిస్థాయిలో స్కూల్స్, థియేటర్లు, జనసమ్మర్థం ఎక్కువగా ఉండే వాటిని బంద్ చేయాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. వారం రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. స్కూళ్లతో పాటు మాల్స్, థియేటర్లను కూడా బంద్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించాయి. 

ఏపీ సీఎం జగన్..వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో 2020, మార్చి 15వ తేదీ ఆదివారం భేటీ అయ్యారు. కరోనా వైరస్ అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం గవర్నర్‌తో ఆయన భేటీ అయ్యారు. 

మరోవైపు ఏపీలోని అన్ని జిల్లాల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసింది. ఈ వ్యాధి లక్షణాలను నిర్ధారించేందుకు..ప్రభుత్వం..ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. తిరుపతి, విజయవాడలో ల్యాబ్‌లను ఏర్పాటు చేసి..వైరస్ ఉన్న వారిని పరీక్షలు చేస్తోంది. తీర ప్రాంతం కావడంతో..అన్ని స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేస్తోంది. ఈ టెస్టులు పూర్తయిన తర్వాతే..రాష్ట్రంలోకి అనుమతినించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 
Read More : రాజమహేంద్రవరంలో కరోనా కలకలం