ఏపీలో కరోనా : ఆ జిల్లాల్లో టెన్షన్..కర్నూలులో అనుమానిత వ్యక్తి ఎక్కడ

  • Published By: madhu ,Published On : March 16, 2020 / 01:11 AM IST
ఏపీలో కరోనా : ఆ జిల్లాల్లో టెన్షన్..కర్నూలులో అనుమానిత వ్యక్తి ఎక్కడ

ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా అనుమానితుల కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కృష్ణా జిల్లాలో వైరస్ కలకలం రేపడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వారిని వెతికి పట్టుకునే పనిలో పడ్డారు. ఇంటింటిని జల్లెడ పడుతున్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైరస్ ఎంట్రీకి అవకాశమివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేశారు.

కర్నూలు జిల్లా గజ..గజ :-
అటు కర్నూల్ జిల్లా కరోనాకు గజ..గజ వణికిపోతుంది. నంద్యాలలో కరోనా సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. సౌదీ అరేబియా నుంచి వ్యక్తికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో జనం భపడిపోతున్నారు. అనుమానిత వ్యక్తి ఆస్పత్రికి వచ్చి ఎవ్వరికీ చెప్పకుండా పోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. కరోనా వదంతులు వేగంగా వ్యాప్తి చెందడంతో ఆస్పత్రిలోని సగం మంది రోగులు భయంతో వెళ్లిపోయారు. దీంతో జన సంచారం లేక నిర్మానుష్యంగా మారింది ఆస్పత్రి ప్రాంగణం. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చికిత్స కోసం వచ్చిన వ్యక్తి తప్పించుకున్నాడని ఆరోపిస్తున్నారు స్థానికులు. అతడి కోసం సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. 

రాజమహేంద్రవరంలో : – 
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కరోనా హైరానా సృష్టించింది. మలేషియా నుంచి వ్యక్తికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు అనుమానించారు వైద్యులు. వెంటనే అతడిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడి రక్త నమూనాలను పుణె లాబోరేటరికి పంపించారు. 

నెల్లూరు జిల్లాలో : –
నెల్లూరు జిల్లా ప్రజలను కరోనా భయం వీడటం లేదు. తొలి పాజిటివ్ కేసు జిల్లాలోనే నమోదు కావడం అతనికి స్థానికంగానే చికిత్స అందిస్తుండటంతో జనం భయాందోళన చెందుతున్నారు. అయితే బాధితుడి కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఎంతో అంగరంగవైభవంగా జరిగే శ్రీ ముత్యాలమ్మ జాతరపై కరోనా ఎపెక్ట్ పడింది. విదేశాల నుంచి వచ్చే భక్తులు జాతరకు రావొద్దని ఈవో జనార్దన్ పిలుపునిచ్చారు. కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్ తీసుకుంటున్న గట్టిగా చర్యలు తీసుకొంటోంది. ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేస్తుంది. వైరస్‌తో వర్రీ వద్దంటున్నారు అధికారులు. 

Read More : ముగియనున్న టి. అసెంబ్లీ సమావేశాలు : నేడు CAAపై వ్యతిరేక తీర్మానం