AP Corona అంటించిన Tuition Class..15 మంది చిన్నారులకు వైరస్

  • Published By: madhu ,Published On : October 2, 2020 / 10:22 AM IST
AP Corona అంటించిన Tuition Class..15 మంది చిన్నారులకు వైరస్

AP Corona : ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటోంది అయినా..వైరస్ విస్తరిస్తూనే ఉంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరు లో 15 మంది చిన్నారులు వైరస్ బారిన పడ్డారు. ట్యూషన్ (Tuition) చెప్పే వ్యక్తికి కరోనా రావడంతో ఇతరులకు వైరస్ సోకింది.




విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అధికారులు అతను ట్యూషన్ చెప్పే ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు. విద్యార్థులను ఎన్ఆర్ఐ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. భట్లూరు గ్రామంలో 39 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసులు మరిన్ని పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.




విద్యా సంస్థలు, టూషన్లు చెప్పవద్దని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా..కొంతమంది పట్టించుకోవడం లేదు. స్కూళ్లు తెరవకపోవడంతో చదువు నష్టపోతారని భావిస్తున్న కొంతమంది తల్లిదండ్రులు ట్యూషన్లకు పంపిస్తున్నారు.




కానీ..ఇలా చేయడం సరైంది కాదని తెలిసినా..కొంతమంది పట్టించుకోవడం లేదు. తాజాగా భట్లూరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై అధికారులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.