Covid-19 AP : ఏపీలో కరోనా 24 గంటల్లో 57 మంది మృతి, 14 వేల 792 కేసులు

ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. అటు పాజిటివ కేసులతో పాటు..మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Covid-19 AP : ఏపీలో కరోనా 24 గంటల్లో 57 మంది మృతి, 14 వేల 792 కేసులు

Covid-19 Andhra Pradesh

COVID-19 Cases : ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. అటు పాజిటివ కేసులతో పాటు..మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 14 వేల 792 మందికి కరోనా సోకింది. 57 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 1,14,158 యాక్టివ్ కేసులుండగా..7 వేల 928 మంది చనిపోయారు.

చిత్తూరు జిల్లాలో 1,831, శ్రీకాకుళం జిల్లాలో 1,829 కొత్త కేసులు వెలుగు చూశాయి. తూర్పుగోదావరిలో 1,702, గుంటూరు జిల్లాలో 1,760 కేసులను నిర్ధారించారు. రాష్ట్రంలో 86 వేల 035 శాంపిల్స్ చేశారు. కోవిడ్ వల్ల అనంతపూర్ లో ఏడుగురు, విజయనగరం ఏడుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడుగురు, తూర్పుగోదావరి లో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, విశాఖపట్టణంలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, వైఎస్ఆర్ కడపలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, గుంటూరులో ఒకరు చనిపోయారు.

గడిచిన 24 గంటల్లో 8 వేల 188 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 1,63,03,866 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 10,81,441 పాజిటివ్ కేసులకు గాను..9 లక్షల 59 వేల 355 మంది డిశ్చార్జ్ కాగా..7 వేల 928 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 1538. చిత్తూరు 1831. ఈస్ట్ గోదావరి 1702. గుంటూరు 1760. వైఎస్ఆర్ కడప 669. కృష్ణా 597. కర్నూలు 876. నెల్లూరు 1002. ప్రకాశం 639. శ్రీకాకుళం 1829. విశాఖపట్టణం 1129. విజయనగరం 624. వెస్ట్ గోదావరి 596. మొత్తం : 14792.

Read More : AP Covid : వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి..ప్రజలు జాగ్రత్త – సీఎం జగన్