విశాఖలో కోలుకున్న కరోనా రోగి..ఆరుగురు నర్సులకు సోకిన వైరస్

  • Published By: madhu ,Published On : March 30, 2020 / 04:30 AM IST
విశాఖలో కోలుకున్న కరోనా రోగి..ఆరుగురు నర్సులకు సోకిన వైరస్

విశాఖపట్టణం వాసులు కొంత ఊరటనిచ్చే వార్త. కరోనా వైరస్ బారిన పడిన ఓ వృద్దుడు కోలుకున్నాడు. ఇతని కాకినాడకు రిపోర్ట్ పంపించగా నెగటివ్ తేలింది. అయితే..పూణే నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని, అనంతరం అతడిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు.

మొత్తం 3 వేల 500 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అనుమానం ఉన్న వారి నుంచి నమూనాలు సేకరించి..ల్యాబ్స్ కు పంపారు. విదేశీయుల నుంచే వైరస్ సోకడం, కాంటాక్ట్ కేసులు నమోదవుతుండడం జిల్లా వాసులను కలవరపాటుకు గురి చేస్తోంది. 

మరోవైపు ఏపీలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా..ఎక్కడో ఒకచోట పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైజాగ్ లో 6 కేసులు నమోదు కావడం జిల్లా వాసులను హడలెత్తించింది. వైరస్ సోకిన వారు నర్సులు కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు 31 మంది అనుమానితుల రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ మహమ్మారీ ఎప్పుడు ఖతమవుతుందోనని ప్రజలు అనుకుంటున్నారు. ఇద్దరు విదేశీయులకు వైరస్ సోకింది. నాలుగు కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి.

21వ తేదీన లండన్ నుంచి వచ్చిన వ్యక్తి రేగడి ప్రాంతానికి వెళ్లాడు. కుటుంబసభ్యులను కలుసుకున్నాడు. ఇతనికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. మొత్తం కుటుంబసభ్యులకు వైరస్ సోకిందని గుర్తించారు వైద్యులు. వీరు నివాసం ఉంటున్న ప్రాంతంపై నిఘా పెట్టారు. మొత్తం 34 మంది నుంచి నమూనాలు సేకరించారు. 

Also Read | ఇంటి అద్దె కోసం ఒత్తిడి చేయొద్దు.. ఇళ్ల యజమానులను హెచ్చరించిన కేంద్రం