Corona : ఏపీ, తెలంగాణలోని స్కూల్స్ లో కరోనా కలకలం

ఏపీ, తెలంగాణలో స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. రెండు రాష్ట్రాల్లోని పాఠశాలలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే కరోనా కలకలం సృష్టిస్తోంది.

Corona : ఏపీ, తెలంగాణలోని స్కూల్స్ లో కరోనా కలకలం

Corona (1)

Corona cases in schools : ఏపీ, తెలంగాణలో స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. రెండు రాష్ట్రాల్లోని పాఠశాలలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమై మూడు రోజులు కూడా గడవకముందే కరోనా కలకలం సృష్టిస్తోంది. నిజామాబాద్ జిల్లా ఎర్రగట్ల మండలం తాళ్లరాంపూర్ ప్రాథమకి పాఠశాలలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ విద్యార్థికి, స్కూల్ సిబ్బందికి పాజిటివ్ గా తేలింది. దీంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులకు కూడా వైద్య అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు.

అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమె క్లాస్ అటెండ్ అయిన విద్యార్థులందరికీ స్కూల్ సిబ్బంది ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎంవోఈవో పాఠశాలకు సెలవు ప్రకటించారు. టీచర్లు, విద్యార్థులకు కరోనా సోకుతుండటంతో తల్లిదండ్రులు వణికిపోతున్నారు. పిల్లలను స్కూల్స్ కు పంపాలంటేనే భయపడుతున్నారు.

ఆటు ఏపీ పాఠశాలల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్న శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు ఎస్టీ గురుకుల పాఠశాలలో కరోనా కేసులు బయటపడ్డాయి. ఒక ఉపాధ్యాయుడితోపాటు ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు.

దీంతో మిగతా విద్యార్థులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. బాధితులను గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో క్వారంటైన్ కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వల్పంగా పెరిగాయి. 24 గంటల్లో 1,186 కేసులు నమోదయ్యాయి.