తిరుమల ధర్మవేద పాఠశాలలో కరోనా కలకలం.. పలువురు విద్యార్థులకు పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. తిరుమలలోని ధర్మవేద పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పలువురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

తిరుమల ధర్మవేద పాఠశాలలో కరోనా కలకలం.. పలువురు విద్యార్థులకు పాజిటివ్

Corona in Thirumala Dharmaveda School : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. తగ్గుముఖం పట్టిందనుకునే సమయంలో మరలా విరుచుకుపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తిరుమలలోని ధర్మవేద పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది.

పాఠశాలలో పలువురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. లాక్ డౌన్ తర్వాత నెలరోజుల క్రితం నుంచే వేద పాఠశాల ప్రారంభమైంది. రాష్ట్రంలో నిన్న 45,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 118మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు.

89 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ 1,43,07,165 మందికి శాంపిల్స్ పరీక్షించారు. ఏపీలో ఇప్పటివరకూ 8,90,884కు కరోనా కేసులు చేరగా, 7,176 మంది కరోనాతో మృతి చెందారు. ఏపీలో 1038 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, 8,82,670 మంది డిశ్చార్జ్ అయ్యారు.