కరోనా ఉంటే మాకేంటీ..స్కూల్స్ ఓపెన్ చేసి పాఠాలు చెబుతున్న అనంత ప్రభుత్వ స్కూల్ టీచర్లు

  • Published By: nagamani ,Published On : July 10, 2020 / 01:30 PM IST
కరోనా ఉంటే మాకేంటీ..స్కూల్స్ ఓపెన్ చేసి పాఠాలు చెబుతున్న అనంత ప్రభుత్వ స్కూల్ టీచర్లు

కరోనా ఉంటే మాకేంటీ? మహమ్మరి కరోనా వైరస్ విజృంచినా మాకు లెక్కలేదు..స్కూల్ ఓపెన్ చేస్తాం..పిల్లలు స్కూల్ కు రావాల్సిందే నంటూ ఏపీలోని అనంతపురం జిల్లాలో టీచర్లు పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఏపీలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు..విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకున్న ప్రభుత్వం జులై 31 వరకూ విద్యాసంస్థలు తెరవకూడదని సూచించింది. కానీ కొంతమంది టీచర్లు అత్యుత్సాహానికి పోయి స్కూల్స్ తెరిచి విద్యార్ధులు రావాలని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక విద్యార్ధులు స్కూల్స్ కు వస్తున్నారు.

వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండపల్లి గ్రామంలో ప్రభుత్వం స్కూల్ ను టీచర్లు ఓపెన్ చేశారు. విద్యార్ధులు రావాలని ఆదేశించారు. ఇదేంటీ ప్రభుత్వం కరోనా వల్ల స్కూల్స్ ఓపెన్ చేయవద్దంది కదా..ఇప్పుడు స్కూల్స్ కు పిల్లల్నిపంపటమేంటి? అని విద్యార్ధులు తల్లిదండ్రులు టీచర్ల ప్రశ్నించారు. దానికి వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ..మా ఇష్టం స్కూల్ ఓపెన్ చేస్తే రావాల్సిందే..లేదంటే మార్కులు తక్కువ వేస్తాం..మాస్కులు పెట్టుకుని వస్తే ఏం కాదు..అని చెప్పటంతో..విద్యార్ధులు భయపడి స్కూల్ కు వస్తున్నారు. టీచర్లు పాఠాలు చెబుతున్నారు.

ఈ విషయం తెలిసిన మీడియా కరోనా కేసులు పెరుగుతున్న ఈ సమయంలో స్కూల్స్ తెరవటమేంటీ అని ప్రశ్నించగా..లేదు లేదు..స్కూల్ రెగ్యులర్ గా తెరవట్లేదు..విద్యార్ధులకు డౌట్స్ వచ్చాయంటే క్లియర్ చేస్తున్నామంటూ సర్ధి చెప్పటానికి యత్నించారు. కానీ రోజు స్కూల్ కు వెళుతున్న తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏంటీ కరోనా వస్తే ఎవరిది బాధ్యత అంటూ విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Here>>నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకేరోజు నలుగురు కరోనా రోగులు మృతి