Corona Tension : కృష్ణా జిల్లాలో భయానక పరిస్థితులు.. 3రోజుల్లో 1000కి పైగా కరోనా కేసులు.. మందులు దొరక్క ఇబ్బందులు

కృష్ణా జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. గత మూడు రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రాణభయం పట్టుకుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

Corona Tension : కృష్ణా జిల్లాలో భయానక పరిస్థితులు.. 3రోజుల్లో 1000కి పైగా కరోనా కేసులు.. మందులు దొరక్క ఇబ్బందులు

Ap Corona

Corona Tension : కృష్ణా జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. గత మూడు రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రాణభయం పట్టుకుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

మరోవైపు కోవిడ్‌ ఇంజక్షన్లతో పాటు మందుల కొరతతో బాధితులు అల్లాడుతున్నారు. డాక్టర్లు రాసిచ్చిన మందుల కోసం మెడికల్‌ షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. అక్కడ కొన్ని మందులు దొరక్కపోవడంతో సకాలంలో వేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రెమిడెసివిర్‌, మైతెల్‌ ప్రిడిమిసోలిన్‌తో పాటు పలు ఇంజక్షన్లు దొరక్క అవస్థలు పడుతున్నారు.

నరసరావుపేటలో గురువారం నుంచి పాక్షిక లాక్‌ డౌన్:
గుంటూరు జిల్లా నరసరావుపేటలో గురువారం(ఏప్రిల్ 22,2021) నుంచి పాక్షిక లాక్ డౌన్ అమలు కానుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకూ మాత్రమే వ్యాపార సంస్థలు తెరిచి ఉంచాలని.. ఆ తర్వాత మూసేయాలని నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సబ్ కలెక్టర్‌తో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రంజాన్ ప్రార్థనలు యధావిధిగా జరుపుకోవచ్చని చెప్పారు. మాస్క్ ధరించకపోతే ఫైన్ వేయాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో బెడ్‌లను పెంచడంతో పాటు మందుల కొరత లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చేందుకు అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు.

ఆసుపత్రుల్లో సౌకర్యాలు తెలుసుకునేందుకు టాస్క్‌ఫోర్స్:
కృష్ణా జిల్లాలో రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కోవిడ్ బాధితులకు సరైన ఆహారం అందిస్తున్నారా..? లేదా అని టాస్క్‌ఫోర్స్ పరిశీలిస్తోంది. అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సర్కార్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తోంది.

ఏపీలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 9వేలకు చేరువలో కొత్త కేసులు, 35మరణాలు:
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజువారీ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరిగింది. 24గంటల్లో 37వేల 922 నమూనాలను పరీక్షించగా 8వలే 987 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు అధికంగా నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,347.. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 99 మందికి వైరస్‌ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం(ఏప్రిల్ 20,2021) బులెటిన్‌లో తెలిపింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,76,987కి చేరింది.

50వేలకు పైగా యాక్టివ్ కేసులు:
24 గంటల వ్యవధిలో కొవిడ్‌ తో 35 మృతి చెందారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 8 మంది మరణించగా.. చిత్తూరు, కడప జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురేసి.. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చనిపోయారు. తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 7వేల 472కి చేరింది. ఒక్కరోజులో 3వేల 116 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 53వేల 889 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,57,53,679 నమూనాలను పరీక్షించారు.