Corona In Guntur: కరోనా టెర్రర్.. చేజారిన గుంటూరు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. కరోనా పరీక్షల కోసం వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక గుంటూరు జిల్లాలో కరోనా కోరలు చాచింది. కరోనా పరీక్షల కోసం వస్తున్నవారి సంఖ్య అమాంతం పెరిగింది.. దీంతో అధికారులు చేతులెత్తేశారు. కరోనా లక్షణాలతో వస్తున్నవారందరికి పరీక్షలు చెయ్యడం అధికారుల వల్లకావడం లేదు.

Corona In Guntur: కరోనా టెర్రర్.. చేజారిన గుంటూరు

Corona In Guntur

Corona In Guntur: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. కరోనా పరీక్షల కోసం వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక గుంటూరు జిల్లాలో కరోనా కోరలు చాచింది. కరోనా పరీక్షల కోసం వస్తున్నవారి సంఖ్య అమాంతం పెరిగింది.. దీంతో అధికారులు చేతులెత్తేశారు. కరోనా లక్షణాలతో వస్తున్నవారందరికి పరీక్షలు చెయ్యడం అధికారుల వల్లకావడం లేదు. ఇక మంగళవారం వరకు పదివేల పరీక్షల ఫలితాలు పెండింగ్ లో ఉన్నాయి.

అవి వచ్చేవరకు రెండు మూడు రోజుల సమయం పట్టె అవకాశం ఉంది. పెద్దమొత్తంలో కరోనా ఫలితాలు రావాల్సి ఉండటంతో మంగళవారం కరోనా పరీక్షలు నిలిపివేశారు. లక్షణాలు ఉన్నవారు హోం ఐసోలేషన్ లో ఉండాలని బోర్డులు పెట్టారు. ఆరోగ్యపరిస్థితిని బట్టి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.

ఇదిలా ఉంటే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కరోనా పరీక్షలు చేయకుండానే వీళ్లను చేర్చుకుంటున్నారు. బుధవారం నుంచి మరో 5 సెంటర్లు ఏర్పాటుచేసి పరీక్షలు చేయడానికి సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పరిస్థితి చేజారినట్టే కనిపిస్తుంది. నలుగురికి పరీక్షలు చేస్తే అందులో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తుంది. గుంటూరు నగరంలో కేసుల తీవ్రత అధికంగా ఉంది.

దీంతో అధికారులు పాక్షిక లాక్ డౌన్ విధించారు. 15 రోజులపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాయంత్రం 6 గంటల వరకు షాపులకు అనుమతి ఇచ్చారు. ఆరు తర్వాత మెడికల్ షాపులు మినహా మిగతా షాపులను మూసేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా లక్షణాలు ఉన్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో వీరు స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు వెళ్తున్నారు.. అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇలా స్థానిక ఆసుపత్రుల్లో చేరడం వలన కరోనా కేసుల లెక్క సరిగా తెలియడం లేదు.