విశాఖ ఏయూ క్వారంటైన్ సెంటర్లలో కరోనా బాధితుల కష్టాలు

  • Published By: bheemraj ,Published On : June 8, 2020 / 09:40 PM IST
విశాఖ ఏయూ క్వారంటైన్ సెంటర్లలో కరోనా బాధితుల కష్టాలు

విశాఖ ఏయూలోని క్వారంటైన్ సెంటర్లు అధ్వాన్నంగా మారాయి. బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యమైన ఆహారం, మంచినీరు అందించడం లేదని, తమను కుక్కల కంటే హీనంగా చూస్తున్నారని వాపోతున్నారు. అధికారులు అందించిన ఆహారం తినకలేక పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆఖరికి చిన్న పిల్లలకు అందించే పాలల్లో చీమలున్నాయని..ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎలా బతికి బయట పడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్స్ ను క్వారంటైన్ సెంటర్స్ గా మార్చారని, అందులో మౌలిక సదుపాయలు కల్పించలేదన్నారు. వారం రోజులుగా దాదాపు 100 మంది భౌతిక దూరం పాటించకుండా ఉంటున్నామని మండిపడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 24 గంట్లలో 154 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో 125 మందికి పాజిటివ్ వచ్చింది. 28 మంది వలస కూలీలు, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా సోకింది. 

దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,843 కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 75 మంది కరోనాతో మృతి చెందారు. ఏపీలో 1381 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,387 మంది డిశ్చార్జ్ అయ్యారు.