ఏపీలోనూ కరోనా కలకలం.. కోనసీమలో వ్యక్తికి కొవిడ్ లక్షణాలు

చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో తొలి కేసు

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 01:41 AM IST
ఏపీలోనూ కరోనా కలకలం.. కోనసీమలో వ్యక్తికి కొవిడ్ లక్షణాలు

చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో తొలి కేసు

చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో తొలి కేసు నమోదు కావడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఏపీలోనూ కరోనా కలకలం చెలరేగింది.

దక్షిణ కొరియా నుంచి వచ్చిన తూ.గో. వాసి:
కోనసీమలో ఓ వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడం భయాందోళనకు గురి చేసింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంకి చెందిన బండారు వెంకటేశ్వర్లుకి కరోనా సోకినట్టు అనుమానిస్తున్నారు. బండారు వెంకటేశ్వర్లు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే సౌత్ కొరియా నుంచి వచ్చాడు. విమానం దిగినప్పుడు చేసిన టెస్ట్ లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. బాధితుడు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినట్లు తెలుసుకుని అధికారులు అలర్ట్ అయ్యారు.

అత్తగారింటికి వెళ్లిన కరోనా బాధితుడు:
బాధితుడు తన అత్తగారి ఇల్లు గోదశివారుపాలెం వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని బాధితుడిని ప్రత్యేక అంబులెన్స్ లో కాకినాడకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వార్త కోనసీమ ప్రజలను భయాందోళనకు గురి చేసింది. చైనా తర్వాత కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న దేశాల్లో సౌత్ కొరియా ఒకటి. బాధితుడు అక్కడి నుంచి రావడం ఆందోళనకు గురి చేస్తోంది.

80 దేశాల్లో కరోనా కల్లోలం:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. చైనాని నాశనం చేసిన కరోనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటివరకు 80కుపైగా దేశాల్లో కరోనా వ్యాపించింది. 90వేల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 3వేల 500 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. దీంతో అంతా హడలిపోతున్నారు.

* తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ కలకలం
* కొత్తపేట మండలం వాడపాలెం వాసికి కరోనా సోకినట్లు అనుమానం
* హైదారబాద్ లో ఉద్యోగం చేస్తున్న బాధితుడు
* ఇటీవల దక్షిణ కొరియా వెళ్లొచ్చిన బాధితుడు

* విమానం దిగినప్పుడు చేసిన టెస్ట్ లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం
* బాధితుడు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినట్లు తెలుసుకుని అలర్ట్ అయిన యంత్రాంగం
* బాధితుడు తన అత్తగారి ఇల్లు గోదశివారుపాలెం వెళ్లినట్లు గుర్తింపు
* బాధితుడిని ప్రత్యేక అంబులెన్స్ లో కాకినాడకు తరలింపు