ఏపీ సెక్రటేరియట్ లో ముగ్గురు ఉద్యోగులకు కరోనా

  • Published By: srihari ,Published On : June 1, 2020 / 12:22 PM IST
ఏపీ సెక్రటేరియట్ లో ముగ్గురు ఉద్యోగులకు కరోనా

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో మూడు, నాలుగు బ్లాకులను అధికారులు మూసివేశారు. ఈ బ్లాకుల్లో శానిటైజేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. ఈ బ్లాకుల్లో పని చేసే ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. దీంతో మూడు, నాలుగు బ్లాకులను మూసి వేసి అందులో పని చేసే సిబ్బందిని విధులకు రావద్దని ఆదేశించారు. 

హైదరాబాద్ లో చిక్కుకుపోయిన కొంతమంది సెక్రటేరియట్ సిబ్బంది ఇటీవలే పది బస్సుల్లో విజయవాడకు చేరుకున్నారు. వీరికి అక్కడ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ముగ్గురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అప్పటికే ఈ ముగ్గురు సిబ్బంది తమ కార్యాలయాల్లో కొందరితో కలిసి మెలిసి తిరిగారు. దీంతో ఆ ముగ్గురు సిబ్బందిని, వారితో పని చేసిన వారిని, బస్సులో జర్నీ చేసిన అందరినీ క్వారంటైన్ కు తరలించారు. ఇప్పటికే 90 మంది ఉద్యోగులను క్వారంటైన్ తరలించారు.

ఏసీ సెక్రటేరియట్ లోని నాలుగో బ్లాకులో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో సెక్రటేరియట్ లో ఉన్న మూడు, నాలుగు బ్లాకులను పూర్తిగా నిర్బంధం చేశారు. ఎరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంగా నిర్ణయించారు. ఈ బ్లాకులను పూర్తిగా మూసివేసి వారందరూ ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. ఎవరూ లోనికి వెళ్లుండా చర్యలు తీసుకున్నారు.

సెక్రటేరియట్ లో ఉన్న అన్ని బ్లాకులను కూడా శానిటైజేషన్ చేస్తున్నారు. సెక్రటేరియట్ పరిసరాల్లో క్రిమి సంహాకర మందుల చల్లుతున్నారు. పూర్తిస్థాయిలో పిచికారి ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

ఈ సందర్భంగా ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. కరోనా సోకిందని తెలిసిన మరుసుటి రోజు నుంచే ఉదయం, సాయంత్రం రెండు పూటలా శానిటైజ్ చేస్తున్నారని తెలిపారు. 
 

Read: రేపు ఢిల్లీకి వెళ్ళనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి