ఏపీలో కరోనా కలకలం.. అనంతపురం, కడప జిల్లాలో ఇద్దరు అనుమానితులు

ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. అనంతపురం, కడప జిల్లాలో కరోనా లక్షణాలతో ప్రజలు వణికిపోతున్నారు. మార్చి 6న పుట్టపర్తికి వచ్చిన రష్యా యువకుడు.. తీవ్ర అనారోగ్యంతో

  • Published By: veegamteam ,Published On : March 16, 2020 / 05:27 AM IST
ఏపీలో కరోనా కలకలం.. అనంతపురం, కడప జిల్లాలో ఇద్దరు అనుమానితులు

ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. అనంతపురం, కడప జిల్లాలో కరోనా లక్షణాలతో ప్రజలు వణికిపోతున్నారు. మార్చి 6న పుట్టపర్తికి వచ్చిన రష్యా యువకుడు.. తీవ్ర అనారోగ్యంతో

ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. అనంతపురం, కడప జిల్లాలో కరోనా లక్షణాలతో ప్రజలు వణికిపోతున్నారు. మార్చి 6న పుట్టపర్తికి వచ్చిన రష్యా యువకుడు.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో ఐసోలేషన్‌ వార్డులో పరీక్షలు నిర్వహించి.. బాధితుడి రక్త నమూనాలను తిరుపతి ల్యాబ్‌కి పంపించారు. ఇటీవల రష్యా నుంచి విహారయాత్రకు బయలుదేరిన యువకుడు థాయిలాండ్, మలేషియా, కేరళ, బెంగళూరులో పర్యటించినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు కడప జిల్లాలోనూ కరోనా భయాలు మొదలయ్యాయి. పది రోజుల క్రితం కువైట్‌ నుంచి పుల్లంపేట మండలానికి వచ్చిన ఓ వ్యక్తి.. దగ్గు, జలుబుతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయంటూ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్‌ నిర్ధారణ కోసం వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Also Read | వృద్ధులు, దివ్యాంగులకు శ్రీ‌వారి ప్రత్యేక దర్శనం

ప్రపంచాన్ని కరోనా కమ్మేస్తోంది. అక్కడా ఇక్కడా అని కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకూ వేగంగా విస్తరిస్తోందీ మహమ్మారి. 157 దేశాలకు పాకిన ఈ భూతం వందల కోట్ల మందిని వణికిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బెంబేలెత్తిస్తోంది. ఓ రకంగా ప్రపంచమంతా ఈ వైరస్‌తో యుద్ధం చేస్తోంది. వైరస్ పాకిన దేశాలు దీన్ని కంట్రోల్‌ చేయడానికి తంటాలు పడుతుంటే… ఈ రాక్షసి తమ దేశంలోకి అడుగుపెట్టకుండా మిగిలిన దేశాలు ప్రయత్నిస్తున్నాయి. లక్షా 69వేల 5వందల మంది వైరస్ బారిన పడగా… ఇప్పటి వరకూ 6వేల 516 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో అమెరికా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆసియా వెలుపల వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందుతోంది. తూర్పు ఆఫ్రికాకూ ఈ మహమ్మారి పాకింది. కెన్యా, ఇథియోపియాల్లో తొలి కేసులు నమోదయ్యాయి.

ఓ రకంగా ప్రపంచమంతా ఈ వైరస్‌తో యుద్ధం చేస్తోంది. కరోనాను ఎదుర్కునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. కరోనా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రాలకు వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి.. పాజిటివ్‌గా తేలితే కరోనా తగ్గేవరకూ చికిత్స అందిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవులిచ్చాయి. సినిమా హాల్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసేశారు.

See Also | ఏపీలో కరోనా లేదు, స్థానిక ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని ఈసీకి సీఎస్ లేఖ