ఏపీలో కరోనా కల్లోలం : ఆ రెండు జిల్లాలు సేఫ్

  • Published By: madhu ,Published On : April 2, 2020 / 06:04 AM IST
ఏపీలో కరోనా కల్లోలం : ఆ రెండు జిల్లాలు సేఫ్

ఏపీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. తొలుత వైరస్ సోకిన కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కానీ క్రమక్రమంగా వైరస్ బారిన పడిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా..పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.

2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం 132 పాజిటివ్ కేసులు నమోదవడం రాష్ట్రాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేస్తోంది. వరుసగా కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంటోంది. గుంటూరు, నెల్లూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

గుంటూరు : మొత్తం పాజిటివ్ కేసులు 20. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 0.
నెల్లూరు : మొత్తం పాజిటివ్ కేసులు 20. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 01.
కడప : మొత్తం పాజిటివ్ కేసులు 15. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00
కృష్ణా : మొత్తం పాజిటివ్ కేసులు 15. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00.
ప్రకాశం : మొత్తం పాజిటివ్ కేసులు 17. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00.
 

పశ్చిమ గోదావరి : మొత్తం పాజిటివ్ కేసులు 14. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00.
విశాఖపట్టణం : మొత్తం పాజిటివ్ కేసులు 11. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 01
చిత్తూరు : మొత్తం పాజిటివ్ కేసులు 08. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00.
తూర్పుగోదావరి  : మొత్తం పాజిటివ్ కేసులు 09. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00
అనంతపురం : మొత్తం పాజిటివ్ కేసులు 2. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00.
కర్నూలు : మొత్తం పాజిటివ్ కేసులు 1. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00.

Also Read | మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నంలో ప్రాణాలర్పించిన ముస్లిం డాక్టర్లు